ఫుడ్ పాయిజన్కు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి

ఫుడ్ పాయిజన్కు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి

కాగజ్ నగర్ బలగాల మైనార్టీ గురుకుల పాఠశాల వద్ద ఏబీవీపీ, బీజేపీ నేతలు ఆందోళన నిర్వహించారు.  ఫుడ్ పాయిజన్ కి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భయంతో ఇప్పటి వరకు 125 మంది విద్యార్థులు ఇండ్లకు వెళ్లిపోయారు. అడిషనల్ కలెక్టర్ గురుకులానికి వెళ్లి పరిస్థితిపై ఆరా తీయగా అక్కడ ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు పిల్లల తల్లిదండ్రులతో ఆసిఫాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్ మాట్లాడారు. 

మైనారిటీ గురుకుల బాలుర పాఠశాలలో సోమవారం రాత్రి ఫుడ్ ​పాయిజన్​ జరిగింది. 52 మంది విద్యార్థులు వాంతులు, కడుపునొప్పితో అస్వస్థతకు గురయ్యారు.  కొన్ని రోజులుగా అన్నంలో పురుగులు వస్తున్నాయని వార్డెన్ కు చెప్పినా పట్టించుకోకపోవడం వల్లే ఇలా జరిగిందని ఆరోపిస్తూ స్టూడెంట్స్  ఆందోళనకు దిగారు. విషయం బయట ఎవరికీ తెలియకూడదని సిబ్బంది గేటుకు తాళం వేశారు. ఇదంతా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. రాత్రి పురుగుల అన్నం తిన్నాక ఫుడ్ పాయిజన్ అయ్యిందని స్టూడెంట్స్ చెబుతున్నారు.