
కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘భారతీయుడు 2’. ఇరవై ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన ‘భారతీయుడు’కు ఇది సీక్వెల్. ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం కొన్ని క్రేజీ అప్‌డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కోసం ఓ భారీ ఈవెంట్‌ను ప్లాన్ చేస్తున్నారని, రజినీకాంత్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని ఇప్పటికే వార్తలొచ్చాయి.
ఇక జూన్‌లో సినిమా రిలీజ్ అని గతంలో ప్రకటించినప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడంతో జులై 12కు వాయిదా వేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు... వీటన్నింటికి మించి మరో బిగ్ సర్‌ప్రైజ్ ఉందట. అదే ‘భారతీయుడు 3’. పార్ట్ 2 క్లైమాక్స్‌లో మూడో భాగం ట్రైలర్‌ను ప్రదర్శించడానికి ప్లాన్ చేస్తున్నారట. దాంతో రిలీజ్ డేట్‌ను కూడా రివీల్ చేస్తారట.
నిజానికి వరుస అవాంతరాలు, కోర్టు కేసులతో అసలు ఈ సినిమా పూర్తవు తుందా అనే అనుమానాల మధ్య ‘భార తీయుడు 2’ షూటింగ్ జరిగింది. ఇప్పు డు ఏకంగా మరో సీక్వెల్ ఉందనే ప్రచా రం జరుగుతోంది. మరి నిజంగానే ఈ సేనాపతి సీక్వెల్‌తో సర్‌ప్రైజ్ చేస్తాడేమో చూడాలి!