రాజా వేటకొస్తే..

రాజా వేటకొస్తే..

‘ఆర్ఎక్స్ 100’తో మెప్పించిన కార్తికేయ.. వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ‘రాజా విక్రమార్క’లో నటిస్తున్నాడు. శ్రీ సరిపల్లి దర్శకుడు. 88 రామారెడ్డి 
నిర్మిస్తున్నారు. తాన్యా రవిచంద్రన్ హీరోయిన్. నిన్న కార్తికేయ బర్త్‌ డే కావడంతో ఈ మూవీ థీమ్ సాంగ్‌‌ను రిలీజ్ చేశారు. ‘రాజాగారు బయటికొస్తే ప్రమాదమే, ప్రయాసతో పరారు అంతే.. రాజాగారు వేటకొస్తే భుజాలపై షికారులే ఖరారు అంతే’ అంటూ కృష్ణకాంత్ రాసిన ఈ పాటని డేవిడ్ సైమన్ పాడాడు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందించాడు.  హీరో హీరోయిన్లతో పాటు సుధాకర్ కోమాకుల, సాయి కుమార్, తనికెళ్ల భరణి, హర్షవర్ధన్‌‌లపై ఈ పాట తీశారు. షూటింగ్  పూర్త యిందని, డబ్బింగ్ వర్క్ జరుగుతోందని, త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని నిర్మాత చెప్పారు. మరోవైపు కార్తికేయ విలన్‌‌గా నటిస్తున్న అజిత్ మూవీ ‘వలిమై’ నుండి తన ఫస్ట్ లుక్‌‌ రిలీజ్ చేశారు. ఒక చేతిలో శాటిలైట్ ఫోన్, మరో చేతిలో మందు బాటిల్ పట్టుకుని సీరియస్ లుక్‌‌లో కనిపిస్తున్నాడు కార్తికేయ. ఈ మూవీతో కోలీవుడ్‌‌లోనూ బిజీ అయ్యే చాన్సెస్ కనిపిస్తున్నాయి.