కరోనా బారిన పడి చనిపోయిన వారి ఖననం కోసం తమిళ సీనియర్ నటుడు విజయ్ కాంత్ భూ దానం చేశారు. కరోనాతో చనిపోయిన వారిని ఖననం చేసేందుకు ఆ స్థలాన్ని వాడుకోవచ్చని ఆయన ప్రకటించారు. కరోనా వైరస్‌తో చనిపోయిన వారిని ఖననం చేస్తే వైరస్ వ్యాప్తి చెందదని, ఈ విషయంపై ప్రజల్లో అవగాహన తీసుకురావాలని విజయ్‌కాంత్ కోరారు.
కరోనా బారినపడిన చెన్నై డాక్టర్ ఇటీవల మృతి చెందాడు. అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు భౌతిక కాయాన్ని శ్మశానానికి తీసుకెళ్లగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారు అడ్డుతగిలారు. అంత్యక్రియలు నిర్వహించడానికి వీల్లేదని పట్టుబట్టారు. అక్కడ ఆయనను ఖననం చేస్తే కరోనా వైరస్ తమకు సోకే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు డాక్టర్ మృతదేహాన్ని తీసుకెళ్లిన అంబులెన్స్ పైనా దాడిచేశారు. ఈ విషయంపై స్పందించిన విజయ్ కాంత్ చెన్నైలోని తన స్థలంలో కొంత భాగాన్ని దానం చేశారు.


