V6 News

ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నం: ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్

ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నం: ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్

హైదరాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చాక వర్గీకరణ చేస్తామని చెప్పారు. బుధవారం మణికొండలోని ఆయన నివాసంలో సంపత్ మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ రెండుసార్లు  అధికారంలోకి వచ్చినా వర్గీకరణపై ఆలోచించడం లేదన్నారు. 
బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ఒక్కసారైనా కేంద్ర కేబినెట్​లో ఎస్సీ వర్గీకరణ అంశం లేవనెత్తారా ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్​లకు బడుగు బలహీన వర్గాల ప్రజలు బుద్ధిచెబుతారన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని  ఆయన ధీమా వ్యక్తం చేశారు.