V6 News

లిఫ్ట్ ఇచ్చి నిలువునా దోచేశాడు.. వృద్ధురాలి పుస్తెల తాడు ఎత్తుకెళ్లాడు

లిఫ్ట్ ఇచ్చి నిలువునా దోచేశాడు.. వృద్ధురాలి పుస్తెల తాడు ఎత్తుకెళ్లాడు

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో దారుణం జరిగింది. అమాయక వృద్ధురాలిని ఆసరాగా చేసుకున్న ఓ కిరాతకుడు ఆమె మెడలోని బంగారం తీసుకుని పారిపోయాడు.  అసలేం జరిగిందంటే.?  ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు  పని  కోసం బయటకు వెళ్తుండగా..  అదే సమయంలో టూ వీలర్ బైక్ పై  వచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి  బైక్‌పై లిఫ్ట్ ఇచ్చాడు.

అయితే  బాధితురాలిని గమ్యస్థానానికి చేర్చకుండా.. వెంకయ్యకుంట గ్రామ శివారులోకి తీసుకెళ్లాడు. నిర్మానుష్య ప్రాంతం రాగానే అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు. అక్కడ ఆమెను దించి.. బెదిరించి ఆమె రెండున్నర తులాల పుస్తెలతాడుతో పాటు, చెవి పోగులు, ముక్కు పోగులను బలవంతంగా లాక్కొని అక్కడి నుంచి బైక్ పై  పారిపోయాడు.

బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ముస్తాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి నిందితుడి కోసం గాలిస్తున్నారు.  దారి వెంట వెళ్లేటప్పుడు అపరిచిత వ్యక్తులు ఇచ్చే లిఫ్ట్‌లను నమ్మి ప్రమాదంలో పడవద్దని పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.