ఎయిర్ టెల్ లో భారీ పెట్టుబడికి సిద్ధమైన గూగుల్

ఎయిర్ టెల్ లో భారీ పెట్టుబడికి సిద్ధమైన గూగుల్
  • అప్పుడు జియోలో 34వేల కోట్లు.. ఇప్పుడు ఎయిర్ టెల్ లో..?

న్యూఢిల్లీ: ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్‌లలో దాదాపు 34 వేల కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టిన గూగుల్ సంస్థ తాజాగా జియోకు ప్రధాన ప్రత్యర్థి అయిన ఎయిర్ టెల్ లో కూడా భారీ పెట్టుబడి పెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. జియోలో 34 వేల కోట్ల పెట్టుబడితో 7.7శాతం వాటాను గూగుల్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 
1.7 లక్షల కోట్ల కోట్ల రుణభారం మోస్తున్న ఎయిర్ టెల్ నిధుల సమీకరణ కోసం ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో రేపు ఆదివారం జరిగి ఎయిర్ టెల్ బోర్డులో ఎంత మేరకు నిధులు సమీకరించాలని, ఎలా సమీకరించాలనేది తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. 
జియోలో భారీ పెట్టుబడితో టెలికాం రంగంలో సంచలనానికి నాంది పలికిన గూగుల్ అటు తర్వాత జియోకు ప్రధాన ప్రత్యర్థి అయిన ఎయిర్ టెల్ పూ కూడా దృష్టి సారించింది. మీ వద్ద కూడా పెట్టుబడికి రెడీ అని గూగుల్ సంకేతాలివ్వడమే కాదు సుందర్ పిచాయ్ స్వయంగా రంగంలోకి దిగి  చర్చలు జరిపిన విషయం వెలుగులోకి వచ్చింది. ఫలితంగా రెండు కంపెనీల మధ్య డీల్ చాలా పెద్దదిగానే ఉండే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. 
ఎయిర్ టెల్.. గూగుల్ రెండు భాగస్వామ్య కంపెనీల ప్రతినిధులు దాదాపు నెల రోజులుగా ఉమ్మడిగా కసరత్తు చేస్తున్నట్లు మార్కెట్ వర్గాలో ప్రచారం జరుగుతోంది. డేటా అనలిటిక్స్ లో విశేష అనుభవం ఉన్న సుందర్ పిచాయ్ సారధ్యంలోని గూగుల్ పెట్టుబడి తమకు మరింత లాభిస్తుందని ఎయిర్ టెల్ భావిస్తున్నట్లు సమాచారం. అలాగే  జియో కంటే ఎయిర్ టెల్ లో పెట్టుబడి ద్వారానే ఎక్కువ ఆదాయం వస్తుందని గూగుల్ భావిస్తున్నట్లు సమాచారం. సుందర్ పిచాయ్ నేతృత్వంలోని గూగుల్ కంపెనీ కంపెనీ ఎయిర్‌టెల్‌తో ‘దాదాపు ఒక సంవత్సరం పాటు జరిపిన చర్చల ప్రయోజనం, డీల్‌సైజ్ గణనీయంగా భారీగా ఉండే అవకాశం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్న నేపధ్యంలో మరికొన్ని గంటల్లో అధికారిక ప్రకటనతో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.