ఆర్థిక సాయం చేస్తే ఐఏఎస్ ఆఫీసర్ ను అవుతా

ఆర్థిక సాయం చేస్తే ఐఏఎస్ ఆఫీసర్ ను అవుతా

కాళ్లే చేతులయ్యాయి..ఎగ్జామ్స్లో పెన్ను పట్టాయి..అతడి లక్ష్యానికి అండయ్యాయి. కానీ ఆర్థికపరిస్థితులే అడ్డుతగిలాయి. ఆ యువకుడికి రెండు చేతులు లేకున్నా.. మనోబలం ఉంది.. బాగా చదివి ఐఏఎస్ కావాలన్న అతడి లక్ష్యం వైకల్యాన్ని మరిపించింది. కానీ ఆర్థిక కష్టాల్ని అధిగమించలేకపోయింది.

బీహార్ లోని ముంగేర్ కు చెందిన నందలాల్ అనే యువకుడు..2006లో కరెంట్ షాక్ తో రెండు చేతులు కోల్పోయాడు. 2017లో ఇంటర్ పూర్తిచేశాడు. అతను ఐఏఎస్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు కానీ ఆర్థికపరిస్థితులు అడ్డుతగిలాయి. ఆదాయం లేకపోవడంతో తన కలను సాకారం చేసుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఆర్థికసాయం అందడంతో 2017లో నందలాల్ ఇంటర్ పూర్తిచేశాడు. చేతులు లేకపోవడంతో అతడు కాళ్లతోనే ఎగ్జామ్స్ రాశాడు.