ఎన్డీఏ కూటమి నుంచి అకాలీదళ్ ఔట్

ఎన్డీఏ కూటమి నుంచి అకాలీదళ్ ఔట్

చండీగఢ్: ఎన్డీఏ కూటమికి శిరోమణి అకాలీదళ్ గుడ్ బై చెప్పింది. కేంద్ర మంత్రి బాధ్యతల నుంచి శిరోమణి ఎంపీ హర్‌‌సిమ్రత్ కౌర్ బాదల్ తప్పుకోవడంతో వారం నుంచి ఎన్డీఏకు అకాలీదళ్ దూరంగా ఉంటోంది. ఇప్పుడు బీజేపీతో బంధానికి పూర్తిగా గుడ్‌‌బై చెప్పేసింది. రైతుల మనోభావాలను పట్టించుకోకపోవడంతోపాటు వ్యవసాయ బిల్లుల విషయంలో కేంద్రం తీరు నచ్చకే కూటమి నుంచి విడిపోయామని అకాలీదళ్ పార్టీ ప్రెసిడెంట్ సుఖ్‌‌బీర్ సింగ్ బాదల్ తెలిపారు. ‘బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి నుంచి వైదొలగాలని శిరోమణి అకాలీదళ్ కోర్ కమిటీ ఏకపక్షంగా నిర్ణయించింది. రైతుల పంటలకు ఎంఎస్‌‌పీతోపాటు మార్కెటింగ్‌‌ను రక్షించడానికి చట్టబద్ధమైన శాసన హామీ ఇవ్వడానికి కేంద్రం మొండి పట్టుదల ప్రదర్శిస్తోంది. అలాగే పంజాబీలు, సిక్కుల సమస్యలను పరిష్కరించడానికి కఠినంగా వ్యవహరిస్తున్నారు’ అని సుఖ్‌‌బీర్ తెలిపారు.