ఈ నెల 20న కొత్త జిల్లాల ప్రకారం అలాట్ మెంట్లు

ఈ నెల 20న కొత్త జిల్లాల ప్రకారం అలాట్ మెంట్లు

హైదరాబాద్, వెలుగు: ఉద్యోగులకు అలాట్​మెంట్ ఆర్డర్లు నేరుగా మెసేజ్ రూపంలో ఫోన్​కే అందనున్నాయి. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఉన్నతాధికారులు చెప్తున్నరు. ఈనెల 20న అలాట్ మెంట్స్​ ఇస్తారని.. ఏ జిల్లాకు అలాట్ అయ్యారో లింక్ రూపంలో మెసేజ్ పంపించనున్నారు. కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ఉద్యోగుల విభజనకు ఆప్షన్ల ప్రక్రియ గురువారంతో ముగియడంతో సీనియారిటీ ప్రకారం ఎవరిని ఏ జిల్లాకు కేటాయించాలనే దానిపై జిల్లా స్థాయి పోస్టులకు కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ నిర్ణయం తీసుకోనుంది. జోనల్, మల్టీ జోనల్ పోస్టులు, ఉద్యోగుల కేటాయింపునకు సంబంధించి సెక్రటరీ లెవెల్ లో కమిటీ నిర్ణయం తీసుకుంటుంది.