MP సెక్యూరిటీతో ప్రైవేటు వ్యక్తి పోజులు

MP సెక్యూరిటీతో ప్రైవేటు వ్యక్తి పోజులు

వరంగల్ అర్బన్ : ఎంపీకి పోలీసులు కేటాయించిన భద్రతా సిబ్బందితో ఓ ప్రైవేటు వ్యక్తి వీడియోలు, ఫొటోలు దిగడం వివాదాస్పదం అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీఆర్ఎస్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ బండ ప్రకాశ్ సెక్యూరిటీ గార్డులతో … ఓయూ జేఏసీ నాయకుడు అల్లుడు జగన్ వీడియోలు తీసుకోవడం.. వాటిని సోషల్ మీడియాలో పెట్టడం కాంట్రవర్సీ క్రియేట్ చేస్తోంది. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

అల్లుడు జగన్ ఓ ప్రైవేటు వ్యక్తి. పార్లమెంట్ సభ్యుడికి అంగరక్షకులుగా ఉన్న సెక్యూరిటీతో ఆయన అల్లుడు పోజులిస్తూ వీడియోలు తీసుకోవడం ఏంటని… ఇది అధికార దుర్వినియోగం అని జనాలు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. ఎంపీ భద్రత గాలికి వదిలేశారని విమర్శిస్తున్నారు. వీడియోలు తీసుకోవడమే తప్పంటే…. వాటిని సోషల్ మీడియాలో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు ఇంటర్నెట్ యూజర్స్. హుజూర్ నగర్ ప్రచారంలో భాగంగా.. పులిచింతల ప్రాజెక్టును ఎంపీ సందర్శించినప్పుడు… ఆయనతో పాటే ఉన్న అల్లుడు జగన్.. ఎంపీ సెక్యూరిటీతో కలిసి వీడియో తీసుకోవడం విమర్శలకు కారణం అవుతోంది.