Siddu Jonnalagadda: సిద్దు జొన్నలగడ్డకి ఇకముందే అసలైన పరీక్ష.. టిల్లు స్క్వైర్ లెక్కలోకి రాదు

Siddu Jonnalagadda: సిద్దు జొన్నలగడ్డకి ఇకముందే అసలైన పరీక్ష.. టిల్లు స్క్వైర్ లెక్కలోకి రాదు

డీజే టిల్లు(DJ Tillu) సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda). ఇండస్ట్రీలో చాలా ఏళ్ళ నుండి ఉన్నప్పటికీ డీజే టిల్లు తరువాతనే ఫేమ్ ను సంపాదించుకున్నాడు. ఇక ఇటీవల వచ్చిన టిల్లు స్క్వైర్ హిట్టుతో మనోడి రేంజ్ నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది. ఈ సినిమా ఏకంగా రూ.130 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. 

అయితే హీరోగా సిద్దుకి ఇకనుండి అసలైన పరిక్ష మొదలుకానుంది. ఎందుకంటే.. టిల్లు పాత్ర అనేది కేవలం సిద్దు బాడీ లాంగ్వేజ్ కి టైలర్ మేడ్ లాటింది. ఆ పాత్ర తనకోసమే క్రియేట్ చేయబడింది కాబట్టి సక్సెస్ అయ్యింది. కానీ, సిద్దు నుండి ఇకనుండి వచ్చి సినిమాలకు హైప్ ఏర్పడుతుంది. కాబట్టి తనని తాను ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి. సిద్దు ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ తో జాక్, దర్శకురాలు నీరజ కోనతో తెలుసు కదా సినిమాలు చేస్తున్నాడు. 

ఈ రెండు సినిమాల్లో సిద్దు పాత్రలు, బాడీ లాంగ్వేజ్ సరికొత్తగా ఉండబోతున్నాయి. అంతేకాదు.. టిల్లు పాత్రలో కాకుండా సిద్దును వేరే పాత్రలో చూడటం ఆడియన్స్ కి కూడా కొత్త ఫీలింగ్. అందుకే.. సిద్దు చేస్తున్న రెండు సినిమాలపైనే అతని ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోవాల్సిన టైం. దీంతో సిద్దు నుండి వస్తున్న రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తినెలకొంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ రెండు సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.