షాకింగ్: కామర్స్ లెక్చరర్ మ్యాథ్స్ చెప్తే.. 120 మంది స్టూడెంట్స్ ఫెయిల్

షాకింగ్: కామర్స్ లెక్చరర్ మ్యాథ్స్ చెప్తే.. 120 మంది స్టూడెంట్స్ ఫెయిల్

బికామ్‌లో ఫిజిక్స్ ఉంటదా అంటే.. ఉంటది ఉంటది ఎందుకుండదూ అనే సమాధానాలు చెప్పిన వీడియోలు అప్పట్లో బాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఆ డైలాగ్ సరిగ్గా సెట్ అయ్యే ఓ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. కామర్స్ లెక్చరర్ మ్యాథ్స్ స్టూడెంట్ట్స్‌కు పాఠాలు బోధించాడు. పాపం దీని కారణంగా రెండు స్కూల్స్‌లో 120 మంది ఫెయిల్ అయ్యారు. 

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని  బర్వానీ జిల్లాలోని ఓ గవర్నమెంట్ లెక్చరర్ ఇంటర్ సెకండ్ ఈయర్, టెన్త్ విద్యార్థులకు మ్యాథ్స్ బోధించాడు. అయితే అతను మ్యాథ్స్ టీచర్ కాదు కామర్స్ లెక్చరర్ దీని వల్ల ఆ స్కూల్స్ లో చదివిన అందరూ విద్యార్థులు బోర్డ్ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యారు.  మాల్ఫాలోని ఇంటర్ కాలేజీలో కామర్స్ చదువుతున్న 85 మంది స్టూడెంట్స్ లో 81 మంది బోర్డ్ ఎగ్జామ్ కు హాజరైతే అందరూ ఫెయిల్ అయ్యారు. 

ఎందుకంటే వాళ్లకి కామర్స్ పాఠాలు చెప్పింది ఓ మ్యాథ్స్ లెక్చరర్.. అదే కాలేజీకి 10 కిమీ దూరంలో పిప్రాని గవర్నమెంట్ హైస్కూల్ లో 41 మంది పదో తరగతి పరీక్షలు రాశారు. వారికి ఓ కామర్స్ టీచర్ మ్యాథ్స్ బోధించాడు. పిల్లలు అందరూ ఫైనల్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యారు.  ఆ రెండూ స్కూల్స్ లో జీరో పర్సెంట్ పాస్ పర్సెంటేజ్ వచ్చింది. విచారణ జరిపిస్తే తేలిన విషయం ఇది.. కామర్స్ టీచర్ పిల్లలకు మ్యాథ్స్ చెప్పడం వల్లే అందరూ పరీక్షల్లో తప్పారు. వెంటనే ఆ లెక్చరర్ ని సస్పెండ్ చేశారు.