మరో కొత్త మతం అబ్రహామిక్​

మరో కొత్త మతం అబ్రహామిక్​

ప్రస్తుతం ప్రపంచంలో 4200లకు పైగా మతాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇందులోకి కొత్త మతం ఒకటి చేరింది. దీనికి అబ్రహామిక్​గా నామకరణం చేశారు. క్రైస్తవం, ఇస్లాం, జుడాయిజం కలయికతో ఈ మతాన్ని ఏర్పాటు చేశారు. వివిధ మతాల మధ్య ఉన్న పరస్పర భేదాలను తొలగించి, ప్రపంచ శాంతి స్థాపనకే ఈ మతాన్ని తీసుకొస్తున్నట్లు 2020లో యూఏఈ, బహ్రెయిన్​, ఇజ్రాయెల్​ దేశాలు ఒప్పందంలో పేర్కొన్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్​ ప్రోద్బలంతో ఈ ఒప్పందం తెర మీదకు వచ్చింది. దీన్ని ఆయన అబ్రహామియన్​ ఒప్పందంగా పేర్కొన్నారు. జుడాయిజం, క్రిస్టియానిటీ, ఇస్లాం మతాల్లో అబ్రహాంను మొదటి ప్రవక్తగా గుర్తిస్తారు.