రిజర్వేషన్లకు మేం వ్యతిరేకం కాదు: ఆర్ఎస్ఎస్ చీప్ మోహన్ భగవత్

రిజర్వేషన్లకు మేం వ్యతిరేకం కాదు: ఆర్ఎస్ఎస్ చీప్ మోహన్ భగవత్

రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్.  హైదరాబాద్‌లోని నాదర్‌గుల్‌లో  మాట్లాడిన ఆయన.. రిజర్వేషన్లకు ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యతిరేకమంటూ ఓ వీడియో వైరల్‌ అవుతోందన్నారు.  సంఘ్ పరివార్ మొదటి నుంచి రాజ్యాంగం నిర్దేశించిన అన్ని రిజర్వేషన్లకు మద్దతిచ్చిందన్నారు. తాము రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అవసరం ఉన్నంత వరకు వాటిని కొనసాగించాల్సిందేనని చెప్పారు.

సమాజంలో బేధ భావాలు పోయే వరకు రిజర్వేషన్లు ఉండాల్సిందేనన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌పై దుష్ప్రచారం చేస్తున్నారని.. ఏఐ ఉపయోగించి తప్పుడు వీడియోలు సృష్టిస్తున్నారని విమర్శించారు. సమాజంలో వివాదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు.. సోషల్​ మీడియాను మంచి కోసం వాడాలని హితవు పలికారు.

 ప్రధాని మోదీ మళ్లీ పీఎం అయితే రిజర్వేషన్లు రద్దు చేస్తారని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. మోదీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను అమలు చేస్తున్నారని విమర్శించారు. దీనికి ఇవాళ మోహన్ భగవత్ కౌంటర్ ఇచ్చారు.