Vishwak Sen: ఆయన ఇండియాలోనే గొప్ప నటుడు.. విశ్వక్ మాటలకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫిదా

Vishwak Sen: ఆయన ఇండియాలోనే గొప్ప నటుడు.. విశ్వక్ మాటలకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫిదా

మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak Sen) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి(Gangs of Godavari). అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాను దర్శకుడు కృష్ణ చైతన్య(Krishna Chaitanya) తెరకెక్కిస్తుండగా.. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్నారు. డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం అందిస్తుండగా.. మే 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొన్నారు. ఈ సంధర్బంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ఆసక్తికార కామెంట్స్ చేశారు. విశ్వక్ సేన్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. ఇండియాలోనే గొప్ప నటుడు ఎన్టీఆర్. ఆయన నటనకి నేను చాలా పెద్ద ఫ్యాన్ ని. ఎప్పటికైనా ఆయనలా నటించాలని కష్టపడుతున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో విశ్వక్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

విశ్వక్ సేన్ మాటలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అభిమాని అంటే నీలా ఉండాలి అన్నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నీ సినిమా గ్యాంగ్స్ అఫ్ గోదావరి సూపర్ హిట్ గా నీలవాలని కోరుకుంటున్నాం అంటున్నారు. ఏదైతేనేం.. ఒకే ఒక్క డైలాగ్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఫిదా చేశాడు విశ్వక్ సేన్.