రాజ వంశానికి చెందని నేతలు ఎందుకు ప్రశ్నించడం లేదు?

రాజ వంశానికి చెందని నేతలు ఎందుకు ప్రశ్నించడం లేదు?

కాంగ్రెస్‌ కుటుంబ రాజకీయాలను విమర్శించిన అమిత్ షా
న్యూఢిల్లీ: గల్వాన్‌ లోయలో ఇండియా–చైనా మధ్య ఘర్షణ, పెట్రోల్ రేట్ల పెంపు లాంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకొని పదే పదే విమర్శలకు దిగుతున్న కాంగ్రెస్ పార్టీకి హోం మినిస్టర్ అమిత్ షా కొన్ని ప్రశ్నలు సంధించారు. ‘ఇండియాలోని ప్రతిపక్ష పార్టీల్లో ఒకటైన కాంగ్రెస్ తనకు తాను కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. వారి ఎమర్జెన్సీ మైండ్ సెట్ ఇంకా అలాగే ఎందుకుంది? ఒక రాజ వంశానికి చెందని నేతలు ఎందుకు ప్రశ్నించడం లేదు? కాంగ్రెస్‌లోని నాయకులు ఎందుకు చిరాకు పడుతున్నారు?.. లేకపోతే ప్రజలతో వారికి ఉన్న దూరం ఇంకా పెరుగుతుంది’ అని అమిత్ షా ట్వీట్ చేశారు.

పరోక్షంగా గాంధీ ఫ్యామిలీ వంశ పారంపర్య రాజకీయాలను లక్ష్యంగా చేసుకొనే షా ఈ వ్యాఖ్యలు చేశారని అవగతమవుతోంది. కాంగ్రెస్ కుటుంబ రాజకీయాలపై బీజేపీ చీఫ్ జేపీ నడ్డా మండిపడిన మరుసటి రోజే షా కూడా ప్రతిపక్ష పార్టీని దుయ్యబట్టడం గమనార్హం.