డెలివరీ బాయ్‌‌గా బిగ్‌‌బి 

డెలివరీ బాయ్‌‌గా బిగ్‌‌బి 

‘కౌన్‌‌ బనేగా కరోడ్‌‌పతి’ సీజన్‌‌ 13కి హోస్ట్‌‌గా ఉన్న బాలీవుడ్‌‌ మెగాస్టార్‌‌‌‌ అమితాబ్‌‌ బచ్చన్‌‌ డెలీవరీ బాయ్‌‌గా మారారు. షోకి వచ్చిన కంటెస్టెంట్‌‌కి డిన్నర్‌‌‌‌ డెలివరీ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. కేబీసీలో పాల్గొనాలనేది చాలామంది కల. హాట్‌‌ సీట్‌‌ వరకు వెళ్లి అమితాబ్‌‌ బచ్చన్‌‌ను కలవాలని, కోట్లు గెలవాలని ఎదురు చూస్తుంటారు. అలానే కలలు కన్నాడు ఆకాశ్‌‌ వాగ్మరె. కేబీసీ హాట్‌‌సీట్‌‌ వరకు వచ్చి అమితాబ్‌‌ బచ్చన్‌‌ మనసు గెలుచుకున్నాడు. ఎంఏ చేసిన ఆకాశ్‌‌ డెలివరీ బాయ్‌‌గా పనిచేస్తూ పోలీస్‌‌ జాబ్‌‌ కోసం ట్రై చేస్తున్నాడు. పేద కుటుంబం కావడంతో డెలివరీ బాయ్‌‌గా పనిచేస్తూ రాత్రిళ్లు ఎగ్జామ్స్‌‌కు ప్రిపేర్‌‌‌‌ అవుతున్నాడు. అలా కేబీసీకి సెలక్ట్‌‌ అయిన ఆకాశ్‌‌ టాప్‌‌స్పీడ్‌‌లో జవాబులు చెప్పి హాట్‌‌సీట్‌‌ వరకు చేరుకున్నాడు. హాట్‌‌సీట్‌‌పైకి వచ్చిన ఆకాశ్‌‌కు అమితాబ్‌‌ డిన్నర్‌‌‌‌ డెలివరీ చేశారు. ‘అందరికీ ఫుడ్‌‌ డెలివరీ చేసే ఒక డెలివరీ బాయ్‌‌కి ఇవాళ నేను డిన్నర్‌‌‌‌ డెలివరీ చేస్తాను. ఆకాశ్‌‌కు నేను డెలివరీ బాయ్‌‌ని’ అంటూ డిన్నర్‌‌‌‌ ఇచ్చారు. అది చూసి అక్కడున్న ఆడియన్స్‌‌ ఒక్కసారిగా చప్పట్లు కొట్టారు. ‘నా జీవితం ధన్యమయ్యింది సార్‌‌‌‌’ అని ఆకాశ్‌‌ ఎమోషనల్‌‌ అయ్యాడు.