ఉపాధి హామీ కూలీ రేట్లు పెంచుతాం: మంత్రి శ్రీధర్ బాబు

ఉపాధి హామీ కూలీ రేట్లు పెంచుతాం: మంత్రి శ్రీధర్ బాబు

పెద్దపల్లి జిల్లా:  కమాన్ పూర్, రామగిరి మండలాల్లో కాంగ్రెస్ పార్టీ కార్నర్ మీటింగ్, బైక్ ర్యాలీ నిర్వహించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రూ.7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కూడా బుణమాఫీ చేయలేదని మంత్రి ఆరోపించారు.  కాంగ్రెస్ గవర్నమెంట్ ఆగస్టు 15 లోపు అందరికీ రుణమాఫీ చేస్తామని హామి ఇచ్చారు. ఉపాధి హామి రోజు కూలీ రేటు రూ.400లకు పెంచుతామని శ్రీధర్ బాబు చెప్పుకొచ్చారు. ఇప్పుడున్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఐదు గ్యారెంటీలను అమలు చేసిందని అన్నారు. ఈ ఎన్నికల్లో రాజ్యాంగాన్ని రద్దు చేస్తామంటున్న  బిజెపికి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. 

రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటే వంశీ ఎంపీగా గెలవాలని అన్నారు. చదువుకున్న వంశీ తన ఆలోచనలతో పెద్దపల్లి ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడతాడని మంత్రి చెప్పుకొచ్చారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీని ప్రకటించారని ఆయన అన్నారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ రాష్ట్రాన్ని భ్రష్ఠు పట్టించిందని మండిపడ్డారు. వంశీని గెలిపిస్తే ఇంజనీరింగ్ చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాడని మంత్రి అన్నారు.