సెక్స్ స్కాండల్ కేసులో.. ప్రజ్వల్ రేవణ్ణకు లుక్ అవుట్ నోటీసులు

సెక్స్ స్కాండల్ కేసులో.. ప్రజ్వల్ రేవణ్ణకు లుక్ అవుట్ నోటీసులు

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కర్ణాటక సెక్స్‌ స్కాండల్‌ కేసులో ప్రధాన నిందితుడైన ప్రజ్వల్‌ రేవణ్ణ పై లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ అయ్యాయి. ఆయన కనిపించిన వెంటనే అరెస్ట్‌ చేయాలని సిట్‌ వారెంట్‌ జారీ చేసింది. దేవేగౌడ కుమారుడు రేవణ్ణ, మనవడు ప్రజ్వల్‌ రేవణ్ణపై లైంగిక ఆరోపణలు నమోదయ్యాయి. ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్‌ దర్యాప్తు చేపడుతోంది. విచారణకు హాజరవ్వాలని తండ్రీ కొడుకులకు నోటీసులు జారీ చేసింది. 

24 గంటల్లోగా ఎస్పీ సీమా లాట్కార్‌ ముందు హాజరుకావాలని ఆదేశించింది. తనకు సమయం కావాలని ప్రజ్వల్‌ రేవణ్ణ సిట్‌ అధికారులను కోరారు. సిట్‌ ముందు హాజరుకావడానికి 7 రోజుల సమయం కావాలి. ఇప్పుడు నేను బెంగళూరులో లేనని తెలిపాడు. ప్రజ్వల్‌ అభ్యర్థనను సిట్‌ తిరస్కరించింది. ఈ మేరకు గురువారం ఉదయం మరోసారి సమన్లు పంపింది. ఆయనపై లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేసింది.