తిరుపతి లడ్డూపై ఏకసభ్య కమిటీతో విచారణ జరిపించాలి.. శ్రీ శివ పీఠం అధిపతి శివ స్వామి..

తిరుపతి లడ్డూపై ఏకసభ్య కమిటీతో విచారణ జరిపించాలి.. శ్రీ శివ పీఠం అధిపతి శివ స్వామి..

పంజాగుట్ట, వెలుగు: తిరుపతి లడ్డూ విషయంలో లోతైన దర్యాప్తు జరగాల్సి ఉందని, ఈ వ్యవహారంపై ఏక సభ్య కమిటీతో విచారణ జరిపించాలని శ్రీ శివ పీఠం అధిపతి శివ స్వామి కోరారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ వేంకటేశ్వర స్వామి ప్రసాదంపై వివాదం నెలకొనడం విచారకరమని అన్నారు.

సిట్​ నివేదికలో నెయ్యి ప్రస్తావనే ఉందని, అసలు ఏమి కలిపారనే విషయం స్పష్టంగా లేదన్నారు. అసలు నెయ్యి కలపలేదన్న ఆరోపణలు ఉన్నాయని, వాటిపై నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దర్యాప్తు సంస్థల నివేదికలు వచ్చేంత వరకు దీనిని రాజకీయం చేయవద్దని, వివాదాస్పద వ్యాఖ్యలు మానుకోవాలని సూచించారు.

తిరుమల ప్రతిష్టను పెంచే అంశంపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాన్ని రాజకీయ అవసరాలకు వాడుకుంటే హిందువుల మనోభావాలు దెబ్బతినే ఆస్కారం ఉందన్నారు. సమస్య పరిష్కారమయ్యేంత వరకు అందరూ సంయమనం పాటించాలని కోరారు.