ఆనంద్ మహీంద్రా ట్వీట్ : ‘భర్త వేపుడు’ తింటారా?

ఆనంద్ మహీంద్రా ట్వీట్ : ‘భర్త వేపుడు’ తింటారా?

 భార్యలను ఈ రెస్టా రెంట్​కు తీసుకెళ్లాలంటే ఓ సారీ ఆలోచించుకుంటారుగా అని రాస్తున్నం. ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో..ఓ ఫొటో బిజినెస్​మెన్​ ఆనంద్ మహీంద్రా కంటపడింది. అందులో ఏం రాసివుందో చదివి, ఒక్కసారిగా స్టన్ ​అయిపోయారు. తేరుకుని కాసేపు నవ్వుకున్నారు. ఆపై నెటిజన్లను చక్కిలిగింతలు పెట్టాలనుకున్నారు. ట్విట్టర్​లో పోస్టు చేశారు. ఇంతకీ అందులో ఏముందో తెలుసా? ‘‘డెలిషియస్​ రోస్టెడ్ ​హస్బెండ్ (భర్త వేపుడు)’ ’ అని వుంది. ఓ చైనీస్​ రెస్టా రెంట్లోని వంటకం పేరది.

ఈ పేరును సోషల్ మీడియాతో తెలియని వారికి తెలిపాలనుకున్న మహీంద్ర..  ‘‘నా భార్యను ఈ రెస్టా రెంట్​కు తీసుకెళ్లాలంటే ఓ సారి ఆలోచిస్తా. పొరపాటున ఆమె ఈ మెనూ చదివి, ఊహించని నిర్ణయం తీసుకుంటే నా పని అంతే!” అని పోస్టులో తెలిపారు. మహీంద్రా పోస్టుకు నెటిజన్లు మనసారా నవ్వుకుని కౌం టర్‌ ఇస్తూ సెటైర్లు వేశారు. ‘‘అంతేగా.. అంతేగా మన పరిస్థితి ఇంతేగా’’ అంటూ జోకులు పేల్చా రు. చైనా భాష మాండరిన్​ నుంచి ఇంగ్లీష్​కు అనువదించడంలో వచ్చిన తప్పువల్ల డిష్​ ఇలా మారిపోయిందన్నమాట!