MBA డ్రాప్ ఔట్.. 15 వేల జీతంతో మొదలు.. ఇప్పుడు వేల కోట్ల ఆస్తులు.. ఎవరీ కునాల్ షా..?

MBA డ్రాప్ ఔట్.. 15 వేల జీతంతో మొదలు.. ఇప్పుడు వేల కోట్ల ఆస్తులు.. ఎవరీ కునాల్ షా..?

ఈమధ్య ప్రముఖ సోషల్ మీడియా సంస్థ మెటా, క్రెడ్ (CRED) కంపెనీలో పెట్టుబడులు పెట్టిన సంగతి మీకు తెలిసిందే. ఆ తర్వాత క్రెడ్ ఫౌండర్ కునాల్ షాకు ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ (WhatsApp) బాధ్యతలను అప్పగించారు. ఈ క్రమంలోనే వివిధ నివేదికల ప్రకారం అతని ఆస్తి విలువ దాదాపు $500 నుండి 600 మిలియన్లు అంటే రూ. 15 వేల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

సాధారణంగా ఇండియాలో పెద్ద పెద్ద టెక్ కంపెనీలు పెట్టేవారంతా ఐఐటీ (IIT) లేదా ఐఐఎం (IIM) బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్లే ఉంటారు. కానీ కునాల్ షా మాత్రం ఎలాంటి పేరున్న కాలేజీల సాయం లేకుండానే ఈ స్థాయికి ఎదిగారు.

ముంబైకి చెందిన ఓ ఎంబీఏ డ్రాపౌట్
కునాల్ షా ముంబైలోని ఒక సాధారణ గుజరాతీ బిజినెస్ ఫ్యామిలీలో పుట్టారు. వాళ్ల నాన్న చిన్న హోల్‌సేల్ మందుల వ్యాపారం చేసేవారు. కునాల్ ముంబైలోని విల్సన్ కాలేజీలో ఫిలాసఫీ (తత్వశాస్త్రం) చదివారు. ఆ తర్వాత నర్సీ మోంజీ కాలేజీలో పార్ట్-టైమ్ ఎంబీఏ (MBA) లో జాయిన్ అయ్యారు. కానీ బిజినెస్ చేయాలనే ఇంట్రెస్ట్‌తో 2004లో.. చేరిన ఏడాదికే చదువు ఆపేశారు. 

కుటుంబ ఆర్థిక ఇబ్బందుల వల్ల టీనేజ్‌లోనే చిన్న చిన్న పనులు చేయడం స్టార్ట్ చేశానని కునాల్ షా గతంలో చెప్పారు. కాగా, ఇప్పుడు వాట్సాప్ గ్లోబల్ చీఫ్‌గా మారడంతో.. ఆయన తన కొత్త బాధ్యతల కోసం కాలిఫోర్నియాలోని 'మెన్లో పార్క్' కు షిఫ్ట్ కానున్నారు.

రూ.15 వేల కోట్ల సంపద ఎలా  
కునాల్ షా ఆస్తి అంతా లిక్విడ్ క్యాష్ (చేతిలో ఉన్న డబ్బు) రూపంలో లేదు. ఇదంతా ఆయన పెట్టిన కంపెనీల షేర్లు, స్టార్టప్‌లలో ఆయన చేసిన ఇన్వెస్ట్‌మెంట్ల రూపంలో (పేపర్ వాల్యూ) ఉంది.

ఫ్రీఛార్జ్ (Freecharge): 2010లో ఆయన పెట్టిన మొదటి సక్సెస్ ఫుల్ కంపెనీ ఇది. దీనిని 2015లో స్నాప్‌డీల్ (Snapdeal) సంస్థ దాదాపు రూ. 2,800 కోట్లకు కొనుగోలు చేసింది. దీని ద్వారానే కునాల్ షాకు మొదటిసారి పెద్ద మొత్తంలో డబ్బు వచ్చింది.

క్రెడ్ (CRED): 2018లో ఆయన పెట్టిన క్రెడ్ యాప్ వాల్యూ ఇప్పుడు $6.4 బిలియన్లు. ఇందులో కునాల్ షాకు దాదాపు 11% నుండి 12% వరకు వాటా ఉంది. ఈ ఒక్క కంపెనీలోనే అతని షేర్ల విలువ దాదాపు రూ. 5,800 కోట్ల నుండి రూ. 6,300 కోట్లు ఉంటుంది.

ఏంజెల్ ఇన్వెస్టర్: తన సొంత కంపెనీలే కాకుండా, ఇండియాలోనే అతిపెద్ద ఇన్వెస్టర్లలో కునాల్ ఒకరు. రేజర్‌పే (Razorpay), అన్‌అకాడమీ (Unacademy), భారత్‌పే (BharatPe) లాంటి 200 కంటే ఎక్కువ స్టార్టప్ కంపెనీలలో ఆయన డబ్బులు పెట్టుబడిగా పెట్టారు.

వేల కోట్లు ఉన్నా.. నెలకు కేవలం రూ. 15 వేల  జీతం
ఇంత సంపద ఉన్నప్పటికీ, కునాల్ షా గతంలో క్రెడ్ కంపెనీ నుండి నెలకు కేవలం రూ. 15 వేలు మాత్రమే శాలరీగా తీసుకున్నట్లు ఒక ఇంటర్వ్యూలో (Ask Me Anything) చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. తన కంపెనీ లాభాల్లోకి వచ్చేంతవరకు నేను పెద్ద మొత్తంలో జీతం తీసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు ఆయన అప్పట్లో వెల్లడించారు.