పేట్ల బురుజు మెటర్నిటీ హాస్పిటల్ లో దారుణం

పేట్ల బురుజు మెటర్నిటీ హాస్పిటల్ లో దారుణం

పేట్ల బురుజు మెటర్నిటీ హాస్పిటల్ లో దారుణం చోటుచేసుకుంది. ఆస్పత్రి వైద్యులు ముగ్గురు మహిళలకు సిసెక్షన్ తో పాటు కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ చేశారు. అలివేలు (25) అనే మహిళ మరణించగా.. శిశువు సురక్షితంగా ఉంది. అలివేలు ఈ నెల 4న పేట్ల బురుజు మెటర్నిటీ హాస్పిటల్ లో  అడ్మిట్ అయిందని బాధిత కుటుంబీకులు తెలిపారు. నిన్న ఆపరేషన్ తరువాత ఆమెకు సీరియస్ అవడంతో.. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కు తరలించారు. ఉస్మానియాలో వైద్యం పొందుతూ అలివేలు చనిపోయింది.

ఈనేపథ్యంలో పేట్ల బురుజు హాస్పిటల్ కు చేరుకున్న ఉస్మానియా వైద్యుల బృందం.. అలివేలు మరణానికి గల కారణాలపై ఆరా తీసింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే అలివేలు చనిపోయిందని ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా... అలివేలు డెడ్ బాడీని అప్పగించారని అంటున్నారు. ఇక పేట్ల బురుజు హాస్పిటల్ లో సర్జరీ చేయించుకున్న  మరో ఇద్దరు మహిళలు కూడా జ్వరం, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు.