రాజ్యసభలో డిప్యూటీ లీడర్ బాధ్యతల నుంచి తొలగింపు: సైలెన్స్ బ్రేక్ చేసిన రాఘవ్ చద్దా

రాజ్యసభలో డిప్యూటీ లీడర్ బాధ్యతల నుంచి తొలగింపు: సైలెన్స్ బ్రేక్ చేసిన రాఘవ్ చద్దా

రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆఫ్) డిప్యూటీ లీడర్‌గా ఉన్న రాఘవ్ చడ్ఢాను పార్టీ హైకమాండ్ తప్పించిన విషయం తెలిసిందే. చద్దా స్థానంలో అశోక్ మిట్టల్‌ను కొత్త డిప్యూటీ లీడర్‌గా నియమించింది. ఇక ముందు నుంచి ఆయనకు పార్టీ కోటా నుంచి స్పీకింగ్ టైమ్ ఇవ్వవద్దని 2026 ఏప్రిల్ 2న ఆప్  రాజ్యసభ సెక్రటేరియట్‌కు లేఖ రాసింది. దేశంలోని ఎవరూ టచ్ చేయని సమస్యలపై మాట్లాడుతూ కామన్ మ్యాన్ గొంతు వినిపించే చద్దాను తొలగించడం వెనుక కారణమేంటని ఇప్పటికే చర్చ జరుగుతోంది.

ఈ వ్యవహారంపై ఎంపీ రాఘవ్ చద్దా తన సైలెన్స్ ను బ్రేక్ చేశారు. బాధ్యతల నుంచి తొలగించడంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు.  బాధ్యతల నుంచి తప్పించిన కొన్ని గంటల తర్వాత ఎక్స్ లోఒక క్రిప్టిక్ ట్వీట్ పోస్ట్ చేశారు. రాజ్యసభలో చేసిన ప్రసంగాల హైలైట్స్  షేర్ చేస్తూ, కేవలం దృష్టి (Evil Eye) ఎమోజీ మాత్రమే పెట్టారు. దిష్టి (నజర్) సింబల్ మాత్రమే పెట్టిన చద్దా.. ఇంకెలాంటి కామెంట్ చేయలేదు.  

చద్దాను బాధ్యతల నుంచి తొలగించడంపై పలు రకాల ఊహాగానాలు నెలకొన్నాయి. ఇటీవల అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోదియా లిక్కర్ స్కామ్ కేసులో నిర్దోషులుగా విడుదలైనా, రాఘవ్ చద్దా పార్టీ కార్యాలయానికి రాలేదు. కేజ్రీవాల్ ప్రెస్ మీట్‌కు కూడా హాజరు కాలేదు. ఇంతకు ముందు లోక్‌సభ ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు కూడా మద్ధతుగా మాట్లాడలేదు. దీంతో పార్టీలో అంతర్గత గొడవలు, రాఘవ్ చడ్ఢాకు, హైకమాండ్ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడ్డాయనే ఊహాగానాలు మరింత బలపడ్డాయి.  మరోవైపు చద్ధా ఎన్డీఏకు టచ్ లో ఉన్నారని, పరోక్షంగా మద్ధతు ఇస్తున్నారనే వార్తలు పుకార్లు కూడా వచ్చాయి. ఈ క్రమంలో పార్టీ తీసుకున్న నిర్ణయం చర్చలకు దారి తీసింది.