ఫ్రాన్స్ అధ్యక్షుడిని పర్సనల్గా టార్గెట్ చేసిన ట్రంప్.. తీవ్రంగా స్పందించిన మాక్రాన్

ఫ్రాన్స్ అధ్యక్షుడిని పర్సనల్గా టార్గెట్ చేసిన  ట్రంప్.. తీవ్రంగా స్పందించిన మాక్రాన్


ఇరాన్ పై యుద్ధానికి తాము పిలిస్తే ఎగేసుకుని నాటో దేశాలన్నీ వస్తాయని భావించిన ట్రంప్ కు.. ఆశాభంగమే అయ్యింది.  స్పెయిన్, ఇటలీ, బ్రిటన్ తర్వాత లేటెస్టుగా ఫ్రాన్స్ కూడా ఓపెన్ గా చెప్పేసింది. ఈ క్రమంలో ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అవుతున్నాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భార్యా బాధితుడు.. దవడ గాయం నుంచి ఇంకా కోలుకుంటున్నాడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

ట్రంప్ వ్యాఖ్యలపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్.  2026 ఏప్రిల్ 02న సౌత్ కొరియా పర్యటనకు వెళ్లే ముందు  మాట్లాడుతూ.. ట్రంప్ పై తీవ్రంగా మండిపడ్డారు. ట్రంప్ టూ మచ్ గా మాట్లాడుతున్నారు. హోదాలో ఉన్న వ్యక్తి ఏం మాట్లాడాలో అనే అవగాహన లేనట్లు అనాలోచితంగా మాట్లాడుతున్నాడు.. అంటూ సీరియస్ అయ్యారు. 

2025 మే లో ఫ్రెంచ్ అధ్యక్షుడు వియత్నాం పర్యటన సందర్భంగా తీసిన ఒక వీడియోను కోట్ చేస్తూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియోలో,  విమానం నుండి దిగడానికి ముందు బ్రిగిట్టే మాక్రాన్ ఫ్రెంచ్ అధ్యక్షుడి ముఖాన్ని తోస్తున్నట్లుగా కనిపిస్తుంది. తాము సరదాగా ఉన్న మూమెంట్ అని.. దాన్ని కూడా తప్పుగా ప్రచారం చేయడమేంటని అప్పట్లోనే ఆయన కొట్టిపారేశారు.  

ట్రంప్ తనకు మద్ధతు ఇవ్వని దేశాలు, నాయకులపై కామెంట్స్ చేయడం కొత్తేం కాదు.  ఇరాన్ పై యుద్ధానికి ఫ్రాన్స్ గగన తలం నిరాకరించిందనీ.. ఇది చాలా హెల్ప్ లెస్.. మాకూ సమయం వస్తుంది.. చూస్తాం.. అంటూ ట్రంప్ ఫ్రాన్స్ పై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ  వ్యాఖ్యలపై ప్రసిడెంట్ మాక్రాన్ తీవ్రంగా స్పందించారు. యుద్ధం మొదలైన రోజు నుంచి మా స్థానం ఏమీ మారలేదు. ఈ యుద్ధంలో మొదటి నుంచి మేము భాగం కాలేదు. యుద్ధానికి వెళ్లే ముందు మాతో సంప్రదింపులు కూడా జరపలేదు. అలాంటిది ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారని మండిపడ్డారు. 

సౌత్ కొరియా పర్యటనలో భాగంగా మాట్లాడుతూ..  ట్రంప్ వ్యాఖ్యలు విరుద్ధంగా ఉన్నాయని, ఒక్కసారి ఒకటి మరోసారి మరొకటి మాట్లాడుతున్నారు. ముందు మీరు క్లారిటీతో ఉండండి. రోజుకో మాట మాట్లాడి కన్ఫూజ్ కాకండి. యుద్ధం ఎలా ముగించాలో ఆలోచించండి అంటూ.. ఘాటుగా సమాధానం చెప్పారు. 

అంతకు ముందుట్రంప్ ఫ్రాన్స్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇరాన్‌తో జరిగిన యుద్ధంలో ఇజ్రాయిల్‌కు సైనిక సామగ్రి తీసుకెళ్తున్న అమెరికా విమానాలకు ఫ్రాన్స్ గగనతలాన్ని ఇవ్వలేదని ట్రంప్ ఆరోపించారు. ఇది చాలా అసౌకర్యాన్ని కలిగించిందని   తన ట్రూత్ సోషల్  ద్వారా తీవ్రంగా విమర్శించారు. అమెరికా దీన్ని గుర్తుపెట్టుకుంటుంది. మాకూ ఒక రోజు వస్తుంది.. అంటూ  హెచ్చరికలు జారీ చేశారు.