Yuvraj Singh: టీమిండియా దిగ్గజ కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోనీ, కపిల్ దేవ్‌లపై తన తండ్రి యోగ్‌రాజ్ సింగ్ చేసిన సంచలన వ్యాఖ్యలపై మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ క్షమాపణలు చెప్పాడు. ఇలా మాట్లాడవద్దని తన తండ్రికి కూడా సూచించినట్లు తెలుస్తుంది. మాజీ క్రికెటర్, కోచ్ యోగ్‌రాజ్ సింగ్ తరుచూ వివాదాస్పద కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తారు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ విజయాల్లో యువరాజ్ సింగ్ కీలక పాత్ర పోషించినప్పటికీ, అతడికి కెప్టెన్సీ రాకుండా ధోనీ అడ్డుకున్నాడని యోగ్‌రాజ్ సింగ్ అనేకసార్లు ఆరోపించాడు. అంతేకాదు తన కెరీర్ త్వరగా ముగియడానికి కపిల్ దేవ్ కారణమని కూడా చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో అతన్ని చంపాలనుకున్నానంటూ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపాయి.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న యువరాజ్ సింగ్‌ను తన తండ్రి యోగ్‌రాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు గురించి క్వశ్చన్ చేయగా.. విచారం వ్యక్తం చేశాడు. ఇలా మాట్లాడకుండా తన తండ్రిని అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు వెల్లడించారు. నా తండ్రి తరపున నేను కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీలకు క్షమాపణలు చెప్తున్నాను.. ఇలా మాట్లాడొద్దని మా నాన్నకు కూడా చెప్పినట్లు ఆ ఇంటర్వ్యూలో యువరాజ్ బదులిచ్చాడు. 1980లో భారత జాతీయ జట్టు నుంచి కపిల్ దేవ్ తనను తప్పించారని, అనంతరం నార్త్ జోన్, హర్యానా జట్ల నుంచి కూడా తప్పించాడని యోగ్ రాజ్ సింగ్ ఆరోపించాడు. అప్పుడు కపిల్ దేవ్‌ను చంపేయాలని అనుకున్నానని గతేడాది ఓ తెలియజేశాడు. చండీగఢ్‌లోని కపిల్ నివాసానికి పిస్టల్‌తో వెళ్లినట్లు కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
కపిల్ దేవ్ భారత్, నార్త్ జోన్, హర్యానా టీమ్స్ కి కెప్టెన్‌గా ఉన్నప్పుడు నన్ను జట్టు నుంచి తొలగించాడు. నా భార్య(యువరాజ్ సింగ్ తల్లి) ఈ విషయంపై కపిల్ దేవ్‌ను నిలదీయాలని కోరినప్పటికీ.. ఆ వ్యక్తికి బుద్ధి చెబుతానని నేను ఆమెతో తెలియజేశాను.. నా గన్ తీసుకుని సెక్టర్ 9లోని కపిల్ ఇంటికి వెళ్లాను.. అతను తన తల్లితో కలిసి బయటకు రాగా.. నేను అతడిని చాలా తిట్టా.. నీ వల్ల నేను ఒక స్నేహితుడిని కోల్పోయానని అరిచా.. నువ్వు చేసిన పనికి ప్రతిఫలం అనుభవిస్తావని శాపనార్థాలు పెట్టినట్లు చెప్పాడు. యోగరాజ్ విమర్శలు కేవలం కపిల్ దేవ్, బిషన్ సింగ్ బేడీ, ఎంఎస్ ధోనీ లాంటి దిగ్గజాలపై కూడా విమర్శలు చేశాడు. నేను బిషన్ సింగ్ బేడీ, కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీల గురించి మాట్లాడుతున్నా.. నేను ఎవరితో అయితే ఉన్నానో వారి గురించి మాట్లాడుతాను.. వారు ప్రజలను చాలా హీనంగా చూశారు.. మన క్రికెటర్లను, జట్టును మన కెప్టెన్లే సర్వ నాశనం చేశారని యోగరాజ్ కామెంట్స్ చేశాడు.
