ఖమ్మం జిల్లాలోని ఈ ఊళ్లో గ్యాస్ కష్టాల్లేవు.. ఎందుకంటే..

ఖమ్మం జిల్లాలోని ఈ ఊళ్లో గ్యాస్ కష్టాల్లేవు.. ఎందుకంటే..

ఖమ్మం, వెలుగు: యుద్ధం కారణంగా చాలా చోట్ల గ్యాస్ కొరత ఏర్పడింది. హోటళ్లలో కమర్షియల్ సిలిండర్లు లభించక కట్టెల పొయ్యిలపై వంటలు చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ, ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభిలో మాత్రం ఇలాంటి సమస్యల్లేవు. ఆ ఊర్లో 300 ఇండ్లలో పైప్ లైన్​ నేచులర్ గ్యాస్​ (పీఎన్జీ) కనెక్షన్లు ఉండడంతో  నేరుగా ఇండ్లకే గ్యాస్ సరఫరా అవుతోంది.

సంబంధిత గ్యాస్ కంపెనీకి డిపాజిట్ డబ్బులు చెల్లించి, ప్రీ పెయిడ్ కనెక్షన్లు తీసుకున్న తర్వాత పైప్​లైన్​ కనెక్షన్ ఇస్తారు. దానికే మీటర్ కనెక్ట్ చేయడంతో ఎంత గ్యాస్​ వాడుకున్నామనే వివరాలు వస్తాయి.  డొమెస్టిక్​ గ్యాస్​ కేజీ రూ.62 వరకు పడుతుండగా, ఈ పీఎన్జీ మాత్రం రూ.51కే  కిలో వస్తోందని వినియోగదారులు చెబుతున్నారు.