6 జిల్లాల్లో టెట్ సెంటర్లు బ్లాక్

6 జిల్లాల్లో  టెట్  సెంటర్లు బ్లాక్

హైదరాబాద్, వెలుగు: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) దరఖాస్తు గడువు బుధవారం సాయంత్రంతో ముగియనున్నది. మంగళవారం సాయంత్రం నాటికి 2,50,963 మంది టెట్​కు అప్లై చేసుకున్నారు.  వారిలో 74,026 మంది పేపర్ 1కి, 16,006 మంది పేపర్​2కు అప్లై చేయగా, రెండు పేపర్లకూ 1,60,931 మంది దరఖాస్తు చేశారు. కాగా, మొత్తం 2,59,123 మంది అభ్యర్థులు ఫీజు చెల్లించారు. చివరి రోజు మరో 50 వేల మంది అప్లై చేసుకునే చాన్స్ ఉందని ఆఫీసర్లు చెబుతున్నారు. 

ఈ సారి కూడా 33 జిల్లాల్లో పరీక్ష  కేంద్రాలను ఏర్పాటు చేయగా.. అప్లికేషన్లు ఎక్కువగా రావడంతో  ఇప్పటికే హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, ఆదిలాబాద్, కుమ్రం భీమ్, నిర్మల్ జిల్లాల్లోని సెంటర్లను బ్లాక్ చేశారు. దీంతో హైదరాబాద్​లో పరీక్ష రాయాలనుకునే వాళ్లు ఇతర ప్రాంతాలను ఎంపిక చేసుకోవాల్సి వస్తోంది. మరోపక్క దరఖాస్తు గడువు పెంచాలని, అప్లికేషన్లకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు.