తెలిసొచ్చిందా : UPI పేమెంట్లతో ఎక్కువ ఖర్చు పెడుతున్నాం.. 75 శాతం మంది ఫీలింగ్ ఇదే

తెలిసొచ్చిందా : UPI పేమెంట్లతో ఎక్కువ ఖర్చు పెడుతున్నాం.. 75 శాతం మంది ఫీలింగ్ ఇదే

ఇండియా ఆర్థిక వ్యవస్థను UPI పేమెంట్స్ మార్చుతున్నాయి. భవిష్యత్ లో ఇంకా ఛేంజ్ చేస్తాయి కూడా.. అది ఏలా అనే విషయం ప్రజలు కచ్చితంగా తెలుసుకోవాలి. మీరు ఆన్ లైన్ పేమెంట్స్ వల్ల హ్యాపీగా ఉన్నారా అని అడిగితే ఏం చెప్తారు. UPI పేమెంట్స్ వల్ల మీకు లాభం జరిగిందా? నష్టమా అని ఎప్పుడైనా ఆలోచించారా? అయితే ఇదే టాపిక్ పై IIT ఢిల్లీలోని అసిస్టెంట్ ప్రొఫెసర్ ధ్రువ్ కుమార్, ఇద్దరు స్టూడెంట్స్ కలిసి ఓ సర్వే చేశాడు. 

డిజిటల్ ఇండియాలో యూపీఐ పేమెంట్స్ కు బాగా చేసే వారి ఎక్స్ పీరియన్స్ ను తెలుసుకోవడానికి గూగుల్ ఫారమ్ ద్వారా 18 సంవత్సరాల వయసు పైబడిన వివిధ వృత్తులు చేసే 276 మందిని కొన్ని ప్రశ్నలు అడిగారు. వారు చెప్పిన అన్సర్స్ వింటే మనం షాక్ అవ్వాలిందే..

UPI పేమెంట్స్ కారణంగా చేయాల్సిన దానికన్నా ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్నామని ఎక్కువ మంది చెప్పారట. ఈ సర్వేలో 74.2 శాతం మంది UPI పేమెంట్ల వల్ల రోజువారీ ఖర్చులు పెరిగిపోయాయని చెప్పారు. కేవలం 7 శాతం మంది మాత్రమే యూపీఐ పేమెంట్స్ చేయడం వల్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ డిజిటల్ పేమెంట్స్ వచ్చిన కానుండి చాలామంది సేవింగ్స్ కూడా తగ్గుతున్నాయని ఆర్థిక వేత్తల అభిప్రాయపడుతున్నారు. 

డబ్బులు ఖర్చు చేయడం సులభంగా మారడంతో జనాలు వెనకా ముందు చూడటం లేదు. కిరాణా షాప్ లో అగ్గిపెట్ట కొన్నా, బంగారం షాప్ లో గోల్డ్ కొన్నా అంతా యూపీఐ పేమెంట్ చేస్తున్నారు. ఒకసారి మీకు మీరే ఆలోచించుకోండి UPI పేమెంట్ల వల్ల మీ అభిప్రాయం ఏంటని..