గుడ్ న్యూస్ : మండే ఎండలకు బై బై.. వర్షాలు పడుతయ్ ఎంజాయ్..

గుడ్ న్యూస్ : మండే ఎండలకు బై బై.. వర్షాలు పడుతయ్ ఎంజాయ్..

మండే ఎండల  నుంచి వాతావరణ  శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ వ్యాప్తంగా ఐదురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టు తెలిపింది. నిర్మల్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, వికారాబాద్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే సూచనలున్నాయని తెలిపింది.
 
మంగళవారం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

ఈ మేరకు ఆరెంజ్‌ అలర్ట్ జారీ చేసింది. నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని టీఎస్‌డీపీఎస్‌ తెలిపింది.