లడఖ్ కు చేరుకున్న ఆర్మీ చీఫ్ నరవాణే.. తాజా పరిస్థితులపై రివ్యూ

లడఖ్ కు చేరుకున్న ఆర్మీ చీఫ్ నరవాణే.. తాజా పరిస్థితులపై రివ్యూ

లడఖ్: సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే గురువారం ఉదయం లడఖ్ కు చేరుకున్నారు. ఎల్ఏసీ వెంబడి తాజా పరిస్థితులను ఆరా తీయడంతోపాటు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో ఆయన చర్చలు జరపనున్నట్లు సమాచారం. ఈ రీజియన్ లో నరవాణే రెండ్రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ విజిట్ లో ఈస్టర్న్ లడఖ్ లో ప్రస్తుత పరిస్థితులను గురించి నరవాణేకు టాప్ కమాండర్లు తెలియ జేస్తారని తెలిసింది. పాంగాంగ్ లేక్ లో యథాతథ స్థితికి ఆటంకం కలిగించడానికి చైనా యత్నించిన సంగతి తెలిసిందే. పీఎల్ఏ పన్నాగాన్ని మన ఆర్మీ దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. ఈ ఘటన జరిగిన రెండ్రోజుల వ్యవధిలోనే పాంగాంగ్ లేక్ లోని వ్యూహాత్మకంగా ఎత్తయిన ప్రదేశాలపై పట్టు పెంచుకోవడం ద్వారా ఇండియా దీటుగా ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలో మున్ముందు తీసుకోవాల్సిన చర్యలు, సన్నద్ధతపై అధికారులతో నరవాణే సంప్రదింపులు జరపనున్నారని తెలుస్తోంది.