రాయ్బరేలీ నుంచి నామినేషన్ వేసిన రాహుల్

రాయ్బరేలీ నుంచి నామినేషన్ వేసిన రాహుల్

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఉత్తర ప్రదేశ్ లోని రాయ్ బరేలీ నుంచి ఎంపీగా నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను సమర్పించారు.  రాహుల్ వెంట సోనియా గాంధీ, సోదరి ప్రియాంక గాంధీ,  కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే,  రాబర్ట్ వాద్రా ఉన్నారు.

సోనియా గాంధీ రాజ్యసభకు ఎంపిక కావడంతో రాయ్ బరేలీ నుంచి ఈ సారి రాహుల్ పోటీ చేస్తున్నారు. రాయ్‌బరేలీ నుంచి దినేష్ ప్రతాప్ సింగ్‌ను బీజేపీ పోటీకి దింపింది.

మరో వైపు అమెథీ నుంచి కిశోరీ లాల్ శర్మ  నామినేషన్ వేశారు.  ఈ రెండు స్థానాలకు మే 20న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్లకు ఇవాళ లాస్ట్ డేట్ కావడంతో రాహుల్  నామినేషన్ వేశారు. వయోనాడ్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న రాహుల్  మరోసారి అక్కడి నుంచే పోటీచేశారు. ఏప్రిల్ 26న అక్కడ పోలింగ్ పూర్తయ్యింది.