ప్లాస్టిక్ బ్యాన్: మాంసాన్ని ఆకులో కట్టి ఇచ్చాడు

ప్లాస్టిక్ బ్యాన్: మాంసాన్ని ఆకులో కట్టి ఇచ్చాడు

ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ వాడకం ఎక్కువవడంతో గ్లోబల్ వార్మింగ్ ప్రబలుతోంది. దీంతో భూమి వేడెక్కడంతో పాటు, హిమాలయాలు ప్రతీ సంవత్సరం కరుగుతున్నాయి. దీంతో మానవాళికి ప్రమాదం వాటిళ్లనుంది. ఇప్పటికే సముద్రంలోని జంతుజాలం ప్లాస్టిక్ వస్తువులలో చిక్కుకుని మరణిస్తున్నాయి. అయితే.. 2019 స్వాతంత్ర దినోత్సవం రోజు ప్రధాని మోడీ ఎర్రకోటనుంచి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించవలసిందిగా ప్రజలను కోరారు. దీంతో ప్రజల్లో క్రమంగా మార్పు వస్తున్నట్టు తెలుస్తుంది. అరుణాచల్ ప్రదేశ్ లోని ఓ మాంసం దుకాణం అతను మాంసాన్ని ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ లో కాకుండా… ఆకులో కట్టి ఇస్తున్నాడు. కొందరు దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పొస్ట్ చేయగా… వీడియో వైరల్ అయింది.  ఆ రాష్ట్ర క్రీడా మంత్రి  ఆ షాపు అతన్ని మెచ్చుకుంటూ.. ట్వీట్ చేశారు. ఇది అరుణాచల్ ప్రదేశ్  ‘రెపా రడా’ జిల్లా, ‘టిర్ బిన్’ అనే రిమోట్ విలేజ్ అని మంత్రి రిజిజూ తెలిపారు.  ప్రధాని మోడీ కోరిన విధంగా ప్లాస్టిక్ ను వాడకపోవడం. దాని బదులుగా ఆకును వాడటం అభినందనీయమని అన్నారు మంత్రి.