కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆప్‌లో చేరేందుకు రెడీ..కానీ ఆ చెత్త మాకొద్దు

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆప్‌లో చేరేందుకు రెడీ..కానీ ఆ చెత్త మాకొద్దు

పంజాబ్ లో అనేక మంది కాంగ్రెస్ నేతలు ఆమ్ ఆద్మీ పార్టీలో చేరేందుకు రెడీగా ఉన్నారన్నారు ఆ పార్టీ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్. అయితే ఆ చెత్తంతా తమకు వద్దన్నారు. తాము చేర్చుకోవడం మొదలుపెడితే సాయంత్రానికల్లా 25 మంది కాంగ్రెస్ MLAలు, ఇద్దరు ముగ్గురు ఎంపీలు ఆప్ లో చేరతారని చెప్పారు. అధికారంలోకి వస్తే పంజాబ్ లో స్కూళ్లను ఢిల్లీ మాదిరిగా అభివృద్ధి చేస్తామన్నారు. పంజాబ్ లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వరుసగా పంజాబ్ లో పర్యటిస్తున్న కేజ్రీవాల్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారంటూ అమృత్ సర్ లో ప్రకటించారు. చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆప్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, కానీ కాంగ్రెస్ చెత్తను ఆప్ లో చేర్చుకోదలుచుకోలేదన్నారు అరవింద్ కేజ్రీవాల్. 

https://www.youtube.com/watch?v=VFXrtTSkP3s