కాబోయే భర్తను అరెస్ట్ చేసింది..సినిమా స్టోరీని తలపించే రియల్ సీన్

కాబోయే భర్తను అరెస్ట్ చేసింది..సినిమా స్టోరీని తలపించే రియల్ సీన్

అసోంలో ఓ మహిళా ఎస్ఐ తనకు కాబోయే భర్త మోసగాడని తెలియడంతో ఏమాత్రం వెనుకంజ వేయకుండా అరెస్ట్ చేసి, కటకటాల్లోకి నెట్టింది. ఇప్పుడు ఆమె పేరు దేశ వ్యాప్తంగా మారు మోగుతోంది. అస్సాంలోని నాగాన్ లో పోలీసు సబ్ ఇన్ స్పెక్టర్ గా జున్మోనీ రభా విధులు నిర్వర్తిస్తున్నారు. గత అక్టోబరులో రానా పోగాగ్ అనే వ్యక్తితో ఆమెకు నిశ్చితార్థం జరిగింది. ఈ ఏడాది నవంబర్‌లో ఆమె వివాహం జరగాల్సి ఉంది. అయితే.. రానా పోగాగ్ తనను తాను ఓ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ గా (పీఆర్వో) జున్మోనీ కుటుంబానికి పరిచయం చేసుకున్నాడు. 

ఇదిలా ఉంటే.. రానా పోగాగ్ ఓఎన్జీసీలో (ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్) పని చేస్తున్నానని చెప్పి పలువురిని నమ్మబలికి, ఉద్యోగాల పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేశాడు. దీంతో విసిగిపోయిన బాధితులకు నిందితుడు గురించి ఒక విషయం తెలిసింది. అతడుపెళ్లి చేసుకునే యువతి ఓ ఎస్ఐ అని తెలిసింది. పైగా నిజాయితీకి మారుపేరని తెలియడంతో ముగ్గురు బాధితులు ఎస్ఐ జున్మోనీ రభాను ఆశ్రయించారు. బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకున్న తర్వాత విచారణ చేసి, కాబోయే భర్త రానా పోగాగ్ ను అరెస్ట్ చేసింది. 

ఎస్ఐ జున్మోనీకి ధైర్యశాలి అధికారిణి అనే పేరుంది. గతంలో ఎంతో క్లిష్టమైన కేసుల్ని కూడా సాహసోపేతంగా డీల్‌ చేశారామె. అందుకే వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయంలోనూ ఆమె డేరింగ్‌ స్టెప్‌ తీసుకుందని పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. పెద్ద మోసగాడి బారి నుంచి తన జీవితం బయటపడినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. అతిడి నిజ స్వరూపం గురించి సమాచారం ఇచ్చిన ముగ్గురు వ్యక్తులకు  కృతజ్ఞతలు తెలియజేశారు. రానా పోగాగ్ ఎంత పెద్ద మోసగాడో చెప్పి వాళ్లు తన కళ్లు తెరిపించారని అన్నారు. 

మరిన్ని వార్తల కోసం..

దెయ్యంవాగులో ఏడాదంతా నీళ్లు..ఎక్కడంటే?

రాష్ట్రంలో రాహుల్ టూర్ షెడ్యూల్