రాష్ట్రంలో రాహుల్ టూర్ షెడ్యూల్ 

రాష్ట్రంలో రాహుల్ టూర్ షెడ్యూల్ 

రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన మినెట్ టూ మినెట్ షెడ్యూల్ ఖరారైంది. ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ కు రాహుల్ చేరుకుంటారు. ఎయిర్ పోర్ట్ నుంచి హెలికాప్టర్ లో వరంగల్ గాబ్రియెల్ స్కూల్ కు చేరుకుంటారు. 6 గంటలకు వరంగల్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో పాల్గొంటారు. 8 గంటలకు వరంగల్ నుంచి రోడ్డుమార్గంలో బయల్దేరి రాత్రి 10గంటల 40 నిమిషాలకు హైదరాబాద్ చేరుకుంటారు. రాత్రికి బంజారాహిల్స్ తాజ్ కృష్ణ హోటల్ లో బస చేస్తారు.

రేపు మధ్యాహ్నం పన్నెండున్నరకు హోటల్ తాజ్ కృష్ణ నుంచి బయలుదేరి సంజీవయ్య పార్కులో దివంగత మాజీ సీఎం సంజీవయ్యకు రాహుల్ నివాళులు అర్పిస్తారు. అక్కడి నుంచి ఒకటిన్నరకు గాంధీభవన్ వెళతారు. 2 గంటల 45 నిమిషాల వరకు ఎక్స్ టెండెడ్ మీటింగ్ లో పాల్గొననున్నారు. ఆ తర్వాత మెంబర్ షిప్ కో ఆర్డినేటర్లతో ఫొటోలు దిగుతారు. మధ్యాహ్నం 3గంటలకు బై రోడ్డు ద్వారా ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. సాయంత్రం 5 గంటల 50 నిమిషాలకు ఢిల్లీ బయల్దేరనున్నారు.

మరిన్ని వార్తల కోసం

నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.. అప్పుడు మీరెక్కడ?

రాహుల్ పర్యటనపై కేటీఆర్, కవిత ప్రశ్నలు