Salim Khan : సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ ఖాన్‌కు తీవ్ర అనారోగ్యం.. ఐసీయూలో చికిత్స!

Salim Khan :  సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ ఖాన్‌కు తీవ్ర అనారోగ్యం.. ఐసీయూలో చికిత్స!

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తండ్రి , ప్రముఖ రచయిత సలీమ్ ఖాన్ తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో కుటుంబం సభ్యులు అయనను  ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేర్పించారు.  90 ఏళ్ల వయసు ఉన్న ఆయన ఆరోగ్యం క్షిణించడంతో ఐసీపీలో చికిత్స అందిస్తున్నారు.  డాక్టర్లు ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

తండ్రిని ఆస్పత్రిలో చేర్పించడంతో సినిమా షూటింగ్ నుంచి హుటా హుటినా బాంద్రాలో ఉన్న లీలావతి ఆస్పత్రిని సల్మాన్ ఖాన్ చేరుకున్నారు. సలీమ్ ఖాన్ కుమార్తె అల్విరా ఖాన్, అల్లుడు అతుల్ అగ్నిహోత్రి, మనవడు అయాన్ , సలీమ్ ఖాన్ దత్త పుత్రిక అర్పితా ఖాన్, ఆమె ఆయుష్ శర్మ  ఆస్పత్రికి విచ్చేశారు. సలీమ్ ఖాన్ ఆరోగ్యంపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. 

 

సలీమ్ ఖాన్ 1960లో తన కెరీర్ ను ప్రారంభించారు. సర్ హదీ టూటేరా, తీస్రీ మంజిల్ వంటి చిత్రాల్లో నటించారు. సినిమాల కోసం తన పేరును పిన్స్ సలీమ్ గా మార్చుకున్నారు. అటు ఎన్నో బాలీవుడ్ హిట్ చిత్రాలకు డైలాగ్ లు కూడా రాశారు. జావెద్ అక్తర్ తో కలిసి షోలే, హాతీ మేరా, అందాజ్, సీతా ఔర్ గీతా,  త్రిశూల్, జంజీర్, దీవార్, డాన్, యాదోన్ కి బారాత్, కాలా పత్తర్, వంటి ఎన్నో ప్రతిష్టాత్మక చిత్రాలకు సలీమ్ ఖాన్ స్క్రిప్ట్ ను అందించారు. 2025 నవంబర్ 24 న ఆయన తన 90వ పట్టినరోజు వేడుకలను కూడా చేసుకున్నారు. ఈ బర్త్ డేకు ముందు కూడా సలీమ్ ఖాన్ ... ఆయన మొదటి భార్య సల్మాఖాన్ తో కలిసి 61వ వివాహా వార్షికోత్సవాన్ని నిర్వహించుకున్నారు.. ఈ కార్యక్రమాన్ని తన బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులతో కలిసి జరుపుకున్నారు.