రాహుల్ పర్యటనపై కేటీఆర్, కవిత ప్రశ్నలు

రాహుల్ పర్యటనపై కేటీఆర్, కవిత ప్రశ్నలు

రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటనపై మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత వరుస ట్వీట్లు చేశారు. రాహుల్ గాంధీ తెలంగాణలో ఎందుకు పర్యటిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ హక్కుల కోసం పార్లమెంట్ లో కాంగ్రెస్ ఎన్నిసార్లు ప్రస్తావించిందని కవిత నిలదీశారు . ఉభయసభల్లో టీఆర్ఎస్ పోరాడుతుంటే..కాంగ్రెస్ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. వరికొనుగోళ్ల విషయంలో దేశ వ్యాప్తంగా ఒకే విధానాన్ని పాటించాలని టీఆర్ఎస్ పోరాటం చేస్తుంటే.. కాంగ్రెస్ ఎక్కడ కూర్చుందని అడిగారు.

తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా.. పెండింగ్ బకాలు, నిధుల గురించి కేంద్రాన్ని టీఆర్ఎస్ ప్రశ్నిస్తుంటే.. కాంగ్రెస్ ఏం చేస్తుందని ట్వీట్ చేశారు. ప్రభుత్వ పథకాలు రాష్ట్రముఖచిత్రాన్ని ఎలా మార్చాయో మీ నాయకులను అడిగి తెలుసుకోండంటూ రాహుల్ కి సూచించారు. కేసీఆర్ పథకాలను స్ఫూర్తిగా తీసుకొని 11 రాష్ట్రాలు ఎలా అమలు చేస్తున్నాయో అర్థం చేసుకోవడానికి తెలంగాణ స్వాగతం పలుకుతుందన్నారు కవిత. ఇక రాహుల్ గాంధీ స్టడీ టూర్ కి స్వాగతం అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఉత్తమ రైతు, స్నేహపూర్వక పద్ధతులను తెలుసుకొని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయాలని సూచించారు.