ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా..

ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా..

నిర్మల్ జిల్లా కహనపూర్ మున్సిపల్ చైర్మెన్ ఎన్నికపై సస్పెన్స్ వీడలేదు. కోరం లేకపోవడంతో చైర్మెన్ ఎన్నిక మంగళవారం ( ఫిబ్రవరి 17 ) కూడా వాయిదా పడింది. ఇవాళ సమావేశానికి కాంగ్రెస్ కౌన్సిలర్లు హాజరైనప్పటికీ బీజేపీ, బీఆర్ఎస్ కౌన్సిలర్లు హాజరు కాకపోవడంతో కోరం లేదంటూ ఎన్నిక వాయిదా వేశారు అధికారులు. 

ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిక సమర్పించిన అధికారులు.. కమిషన్ ఆదేశాల మేరకు చైర్మెన్ ఎన్నిక తేదీని మళ్ళీ ప్రకటిస్తామని తెలిపారు. 

ఖానాపూర్ మున్సిపాలిటీలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాకపోవడంతో హంగ్ ఏర్పడిన విషయం తెలిసిందే. సోమవారం జరిగిన ఎన్నిక సమావేశానికి ఖానాపూర్ మున్సిపాలిటీలో 12 మంది కౌన్సిలర్లకు గాను కాంగ్రెస్ కు చెందిన ముగ్గురు, ఒక్క ఇండిపెం డెంట్ మాత్రమే హాజరయ్యారు. 

దీంతో వచ్చిన కౌన్సి లర్లతోనే అధికారులు ప్రమాణస్వీకారం చేయించారు.మితగావారు హాజరుకాకపోవడంతో కోరం లేక ఎన్నికలు వాయిదా వేశారు. మంగళవారం కూడా కోరం లేకపోవడంతో చైర్మెన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది.