36 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్ కు ఓ మగాడు పీఎం అయ్యాడు..!

36 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్ కు ఓ మగాడు పీఎం అయ్యాడు..!

36 ఏళ్ల తర్వాత ఓ మగాడు బంగ్లాదేశ్ పీఎం అయ్యాడు..  మూడున్నర దశాబ్దాలపాటు ఇద్దరే ఇద్దరు మహిళలు బంగ్లాదేశ్ ను ఏలారు. మధ్యలో మగాళ్లు పాలించినా యాక్టింగ్ ప్రధానులుగా నే చేశారు. తాత్కాలిక ప్రధానమంత్రులుగాను ఉన్నారు. చరిత్రను తిరగరాస్తూ బంగ్లాదేశ్ కొత్త ప్రధానమంత్రిగా తారిఖ్ రెహమాన్ ప్రమాణ స్వీకారం చేశారు. 

ఇటీవల పదవీచ్యుతురాలు కాకముందు వరకు అవామీ లీగ్ పార్టీ చీఫ్  షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానిగా వరుసగా 15ఏళ్లు  పాలించారు. అంతకుముందు ఐదేళ్లు బీఎన్ పీ వ్యవస్థాపకురాలు ఖలీదా జియా.. అంతకుముందుఐదేళ్లు షేక్ హసీనా.. ఆమె కు ముందు  ఖలీదా ఇలా ఏకంగా 36 ఏళ్లు బంగ్లాదేశ్ మహిళల పాలనలో ఉంది.  వీరి మధ్యలో కొంత మంది పురుషులు పరిపాలించినా.. వాళ్లంతా యాక్టింగ్ ప్రధానమంత్రులుగానే చేశారు. తాత్కాలిక ప్రధానమంత్రులుగా వ్యవహరించారు. అయితే ఇప్పుడు ఖలీదా కుమారుడు అయిన తారీఖ్ రెహమాన్ ఓ పురుషుడుగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టాడు. దశాబ్దాలుగా దేశ రాజకీయాల్లో ప్రత్యర్థి శిబిరాల నుంచి మహిళా నేతల ఆధిపత్యానికి ముగింపు పలకడమే కాదు.. బంగ్లాదేశ్ లో రాజకీయంగా  కీలక పరిణామాలు చోటు చేసుకోబుతున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 

జాతీయ సంసంద్ భవన్ సౌత్ ప్లాజాలో మంగళవారం (ఫిబ్రవరి 17) సాయంత్రం అధ్యక్షుడు మహ్మద్ షాబుద్దీన్ ప్రమాణస్వీకారం చేయించారు.  రెహమాన్‌తో పాటు 25 మంది బిఎన్‌పి శాసనసభ్యులు క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. నేషనల్ పార్లమెంట్ కాంప్లెక్స్‌లోని సౌత్ ప్లాజాలో జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు 1200 మంది అతిథులు పాల్గొన్నారు. భారత్ నుంచి స్పీకర్ ఓం బిర్లా హాజరయ్యారు. 

ఇటీవల జరగిన బంగ్లాదేశ్ 13వ పార్లమెంటరీ ఎన్నికల్లో బీఎన్ పీ 297 సీట్లు గెలుచుకొని భారీ మెజార్టీ సాధించింది. ప్రతిపక్ష పార్టీ  జమాతే ఇస్లామీ 68 సీట్లను గెలుచుకుంది. మాజీ ప్రధాని షేక్ హసీనా అవామీ లీగ్ ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించారు. బంగ్లాదేశ్‌లో నిర్ణయాత్మక ఎన్నికల ఫలితం తర్వాత రెహమాన్ ప్రమాణ స్వీకారంతో భారత్ , బంగ్లా దౌత్య సంబంధాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.