హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ వివాదం హైకోర్టుకు చేరింది. 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరిని ఎవరో కిడ్నాప్ చేశారని ఆయన కొడుకు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్పై విచారించిన హైకోర్టు.. గురువారం రోజు తమ ముందు యాదగిరిని హాజరు పర్చాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
ALSO READ : ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా..
అప్పటి వరకు చైర్మన్ ఎన్నికపై స్టే విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. అనూహ్యంగా మంగళవారం రోజు కౌన్సిల్లో యాదగిరి కనిపించడం కొసమెరుపు. చైర్మన్ ఎన్నిక ప్రక్రియ అంతా పూర్తయిన తరువాత హైకోర్టు నుంచి ఆదేశాలు రావడంతో చివరి నిమిషంలో హైకోర్టు స్టే కారణంగా చైర్మన్ ఎన్నిక ప్రకటన ఆగిపోయింది.
