నీ ఫ్రస్టేషన్ ఇంకెక్కడైనా చూపించుకో బాల్క సుమన్.. చెన్నూరులో కాదు: మంత్రి వివేక్ వెంకటస్వామి

నీ ఫ్రస్టేషన్ ఇంకెక్కడైనా చూపించుకో బాల్క సుమన్.. చెన్నూరులో కాదు: మంత్రి వివేక్ వెంకటస్వామి

బాల్క సుమన్ గుండా గిరిపై మంత్రి వివేక్ వెంకటస్వామి ఫైర్  అయ్యారు. ఇలాంటి గుండాగిరి రాష్ట్రంలో ఎక్కడా లేదన్నారు. ఓడిపోయిన ఫ్రస్టేషన్ తోనే బాల్క సుమన్ తమ కాన్వాయ్ పై దాడులకు పాల్పడ్డారని మంత్రి అన్నారు. బీఆర్ ఎస్ హయాంలోనే ప్రజాస్వామ్యం ఖూని అయ్యింది.. కాంగ్రెస్ హయాంలో అంతా ప్రజాస్వామ్య బద్ధంగానే ఎన్నిక జరిగిందన్నారు. 

క్యాతనపల్లిలో  అంతా ప్రజాస్వామ్య బద్దంగానే మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. చైర్మన్ ఎన్నిక కూడా ఎలాంటి గొడవలు లేకుండానే  జరిగింది.  చైర్మన్ ఎన్నికపై బీఆర్ ఎస్ కూడా ఎలాంటి కంప్లైంట్ చేయలేదు.. బాల్క సుమన్ ఫ్రస్టేషన్ తో మా కాన్వాయ్ పై రాళ్ల దాడి చేశారు. మాజీ ఎంపీగా, మాజీ ఎమ్మెల్యేగా ఇలాంటి దాడులు చేయడం సరైంది కాదని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. 

మంగళవారం(ఫిబ్రవరి17 చెన్నూరు నియోజకవర్గంలోని క్యాతనపల్లిలో  మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి  ఎంపీ గడ్డం వంశీకృష్ణ క్వాన్వాయ్ ప దాడి జరిగింది. క్యాతనపల్లి మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం, చైర్మన్  ఎన్నిక సందర్భంగా   కో ఆప్షన్ మెంబర్స్ గా సమావేశానికి హాజరు కాగా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ , అతని అనుచరులు దాడి చేశారు. బాల్క సుమన్ స్వయంగా ట్రాఫిక్ కోన్ తో మంత్రి కారుపై దాడి చేశారు.  

దీంతో క్యాతనపల్లిలో ఉద్రికత్త  నెలకొంది. ఈ దాడిలో ఓ పోలీస్ కానిస్టేబుల్ కు కూడా గాయాలయ్యాయి.  ఓడిపోయామన్న ఫ్రస్టేషన్ తోనే బాల్క సుమన్ దాడికి దిగారని మంత్రి మండిపడ్డారు. ఇలాంటి దాడులను ప్రోత్సహించడం బాల్కసుమన్ కు మానుకోవాలని మంత్రి హెచ్చరించారు.