ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కలవడం అంటే అంత సులువైన పనికాదంటూ ఇటీవల బాలీవుడ్ బ్రాండ్ స్ట్రాటజిస్ట్ కావేరి బారువా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. బన్నీని కలవాలంటే ఆయన టీమ్ సుమారు 42 కఠినమైన కండిషన్స్ తో కూడిన ఒక డాక్యుమెంట్‌ను పంపిస్తుందని, అందులో ఆయన ముందు ఎలా కూర్చోవాలి, ఏం మాట్లాడాలి అనే విషయాలపై ఆంక్షలు ఉంటాయని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. అటు బన్నీ టీమ్ కూడా సీరియస్ గా రియాక్ట్ అయింది.
బన్నీ టీమ్ లీగల్ వార్నింగ్
ఈ ఆరోపణలపై అల్లు అర్జున్ టీమ్ తీవ్రంగా స్పందించింది. తమ హీరో ప్రతిష్టకు భంగం కలిగించేలా అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించింది. అసలు అటువంటి డాక్యుమెంట్ తమ వద్ద లేనే లేదని స్పష్టం చేసింది. ఆధారాలు లేకుండా మాట్లాడినందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని అంత తేలికగా తీసుకోబోమని హెచ్చరించింది. అటు తన అభిమాన నటుడిని వివాదాల్లోకి లాగాలని చూస్తే, గట్టిగానే బుద్ధి చెబుతారని ఫ్యాన్స్ కూడా హెచ్చరించారు.
క్షమాపణలు చెప్పి కావేరి బారువా
బన్నీ టీమ్ స్టాంగ్ వార్నింగ్ తో కావేరి బారువా , పాడ్‌కాస్టర్ స్వీకృతి దిగివచ్చారు. సోషల్ మీడియా వేదికగా బహిరంగ క్షమాపణలు చెబుతూ పోస్ట్ చేశారు.. ఫ్లోలో చేసిన ఆ వ్యాఖ్యలు కేవలం విన్న మాటలే తప్ప.. అందులో వాస్తవం లేదు. అల్లు అర్జున్ పై మాకు గౌరవం ఉంది. ఆయన పై అనవసర ఆరోపణలు చేసినందుకు చింతిస్తున్నామని పేర్కొంటూ ఆ వివాదాస్పద ఎపిసోడ్‌ను ఇంటర్నెట్ నుండి తొలగించారు.
— Kaveri Baruah (@kaveri_baruah) February 15, 2026
వరుస సినిమాలతో బిజీ ..
ప్రస్తుతం అల్లు అర్జున్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఒక భారీ చిత్రంలో నటిస్తున్నారు.. దీంట్లో బన్నీ సరసన దీపికా పదుకొనె నటిస్తోంది. మరో వైపు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారు. జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో తర్వాత ఈ సక్సెస్‌ఫుల్ కాంబో మళ్ళీ రిపీట్ కానుందని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాగే 'యానిమల్' ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో ఒక పవర్ ఫుల్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
