ఎలక్షన్ కమిషన్.. ఓ తుగ్లక్ కమిషన్.. 58 లక్షల ఓట్లు ఎలా తొలగిస్తారన్న మమత బెనర్జీ

ఎలక్షన్ కమిషన్.. ఓ తుగ్లక్ కమిషన్.. 58 లక్షల ఓట్లు ఎలా తొలగిస్తారన్న మమత బెనర్జీ

ఎలక్షన్ కమిషన్ చెత్త పెర్ఫార్మెన్స్..ప్రజలను ఉగ్రవాదులుగా చూస్తూ వారి ఓట్లను తొలగిస్తుంది..స్వతంత్రంగా పనిచేయాల్సిన కమిషన్ బీజేపీతో అంటకాగుతూ ప్రజల హక్కులను లాక్కుంటుంది.. బీజేపీ ఆదేశాల మేరకు ఓటర్ల పేర్లను తొలగిస్తుంది.. ఇదేంటని ప్రశ్నించిన  అధికారులను ఉద్యోగాలనుంచి తొలగిస్తుంది.. దేశంలో  ఎలక్షన్ కమిషన్ ఓ తుగ్లక్ కమిషన్ లా మారిందని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. 

పశ్చిమ బెంగాల్ లో దాదాపు 58 లక్షల ఓట్లను తొలగించారు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి చేశారు. బీజేపీ ఐటీ సెల్ కు చెందిన మహిళ కార్యకర్తలతో ఈ పనిచేశారని మమత ఆరోపించారు. ఎలక్షన్ కమిషన్ బీజేపీ ఆదేశాల మేరకు పనిచేస్తుంది.. సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం ధిక్కరిస్తోందని మమత విమర్శించారు. 

పశ్చిమ బెంగాల్ లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)  అర్హులైన ఓటర్లను తొలగిస్తూ  తీవ్ర ఆందోళనకు గురి చేస్తుందన్నారు  మమత. సర్ ఆందోళన,  పని ఒత్తిడి కారణంగా 160 మంది బీఎల్ వో ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ఓటర్లను లక్ష్యంగా చేసుకొని ప్రజాస్వామ్య సూత్రాలను దెబ్బతీస్తోందన్నారు. 

బీజేపీ సూచనల మేరకే ఎలక్షన్ కమిషన్ ఓటర్ల పేర్లను తొలగిస్తుందని..  సవరణ ప్రక్రియ ఓ తప్పుల తడక అని అన్నారు. సాధారణ ప్రజల ఉగ్రవాదులుగా చూస్తోంది..  వారి ఓట్లను  నిర్దాక్షిణ్యంగా తొలగిస్తూ ప్రజాస్వామ్య హక్కులను లాక్కుంటోందన్నారు మమత. 

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ అధికారులకు ఈసీ జరిమానాలు విధిస్తే ..  రాష్ట్ర ప్రభుత్వం 100 శాతం కాపాడుకుంటుందని హెచ్చరించారు. కమిషన్  ద్వారా  ఏ అధికారి అయినా ఉద్యోగం కోల్పోతే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం పదోన్నతి కల్పిస్తుందన్నారు. 

బీజేపీని సంతృప్తి పర్చేందుకు బెంగాల్ ను ఒంటరి చేస్తున్నారని.. పౌరుల హక్కులను కాలరాసే ఏ చర్య అయినా  తమ ప్రభుత్వం ప్రతిఘటిస్తుందని మమతా బెనర్జీ హెచ్చరించారు.