భూమిపైకి ఆస్టరాయిడ్ మట్టి శాంపిళ్లు

భూమిపైకి ఆస్టరాయిడ్ మట్టి శాంపిళ్లు
  • ర్యుగు ఆస్టరాయిడ్​ నుంచి సేకరించిన హయబుసా-2

బెంగళూర్: జపాన్ స్పేస్ క్రాఫ్ట్ హయబుసా–2 ఆస్టరాయిడ్ శాంపిళ్లను భూమిపైకి పంపింది. భూమికి 30కోట్ల కిలోమీటర్ల దూరంలోని ర్యుగు ఆస్టరాయిడ్​పై మట్టిని, మెటీరియల్​ను కలెక్ట్​ చేసిన హయబుసా–2… ఆ శాంపిళ్లతో కూడిన క్యాప్సూల్​ను భూమిపైకి జారవిడిచింది. అది ఆదివారం ఆస్ట్రేలియాలోని వుమెరాలో ల్యాండ్ అయింది. దాన్ని సైంటిస్టులు స్వాధీనం చేసుకొని పరీక్షలు చేస్తున్నారు. జపాన్ 2014లో హయబుసా–2ను స్పేస్ లోకి పంపించింది. 2019 మొదట్లో ర్యుగు శాంపిళ్లను సేకరించిన స్పేస్ క్రాఫ్ట్.. నవంబర్​లో తిరుగు పయనమైంది. భూమికి 2.20 లక్షల కి.మి. ఎత్తులో నుంచి16 కిలోల కంటెయినర్​ను జారవిడిచింది.  2010లో హయబుసా–1 ప్రాజెక్టును చేపట్టి ఇటోకవా ఆస్టరాయిడ్ నమూనాలను భూమికి తీసుకొచ్చింది.

సోలార్ సిస్టమ్ గుట్టు తెలుస్తది…

సోలార్ సిస్టమ్ గుట్టును తెలుసుకునేందుకు ఈ శాంపిళ్లు ఎంతగానో ఉపయోగపడతా యని సైంటిస్టులు చెబుతున్నారు. వీటిని పరిశోధిస్తే నీరు, భూమి పుట్టుక గురించి మరిన్ని వివరాలు తెలుస్తాయని చెప్పారు. హయబుసా–2  స్పేస్ క్రాఫ్ట్ మరో రెండు ఆస్టరాయిడ్స్ పైకి వెళ్లనుంది. అది 2026 వరకు 2001 సీసీ21, 2031 వరకు 1998 కేవై26 అనే ఆస్టరాయిడ్స్ ను చేరుకోనుంది.