వెన్ను నొప్పికి కొత్త రకం ట్రీట్మెంట్

వెన్ను నొప్పికి కొత్త రకం ట్రీట్మెంట్

వెన్ను నొప్పి చాలామందిని వేధించే సమస్య. అయితే చైనాలో దీనికి ఓ కొత్తరకం ట్రీట్మెంట్‌‌ కనిపెట్టారు. వెన్నునొప్పితో బాధపడుతున్నవాళ్లంతా వందల సంఖ్యలో మొసళ్లలాగ పాకుతున్నారు. దీన్నే ‘క్రొకడైల్ క్రాలింగ్’ అని పిలుస్తున్నారు. ఇదొక కొత్త రకం పెయిన్ రిలీఫ్ టెక్నిక్ అని అక్కడి ట్రైనర్లు చెప్తున్నారు.

వందల మంది ఒకచోట చేరి నాలుగు కాళ్ల జంతువుల్లా పాకే ట్రెండ్ చైనాలో పాపులర్ అవుతోంది. ఈ ఎక్సర్‌‌‌‌సైజ్‌‌ను 8 నెలల పాటు చేస్తే వెన్ను కండరాలు గట్టిపడి, వెన్ను నొప్పి నుంచి రిలీఫ్ వస్తుందని ‘క్రొకడైల్ వాక్’ గ్రూప్ ఫౌండర్ లివీ చెప్తున్నాడు. క్రొకడైల్ వాక్.. ఇంటర్‌‌వర్టెబ్రల్ డిస్క్‌‌పై ఒత్తిడి తగ్గించి, వెన్నెముక బలాన్ని మెరుగుపరుస్తుందట. అయితే  డయాబెటిస్, బీపీ, గుండె సమస్యలతో బాధపడేవాళ్లు క్రాలింగ్ చేయకూడదని వాళ్లు చెప్తున్నారు. ఒకే రకమైన బట్టలు, గ్లోవ్స్‌‌ వేసుకుని చేతులు, కాళ్లపై నెమ్మదిగా పాకుతున్న వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే ట్రైనర్ లేకుండా దీన్ని ట్రై చేస్తే తిప్పలు తప్పవంటున్నారు నిపుణులు.