గ్లోబల్ వార్మింగ్ : సముద్రం ఇళ్లల్లోకి వచ్చేసింది..!

గ్లోబల్ వార్మింగ్ : సముద్రం ఇళ్లల్లోకి వచ్చేసింది..!

కోజికోడ్:కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ జిల్లాలో కళ్లకడల్ బీభత్సం సృష్టించింది. సముద్రం ఉప్పొంగి  నీరు నివాస ప్రాంతాలను ముంచెత్తింది. జిల్లాల్లోని కోజికోడ్ బీచ్, వెస్ట్ హిల్ శాంతి నగర్ కాలనీ, భట్ రోడ్ ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. దీంతో సముద్రం ఉప్పొంగి నీరు ఇళ్లలోకి రావడంతో అక్కడి ప్రజలు నివాసాలు వదిలి వేరేచోటికి వెళ్లాల్సి వచ్చింది. వెస్ట్ హిల్ శాంతినగర్  కాలనీలో చాలా ఇండ్లలోకి నీరు వచ్చి చేరింది. దీంతో అక్కడి తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. 

కళ్లకడల్ అంటే సముద్రం హఠాత్తుగా ఉప్పొంగడం.. బలమైన సముద్ర అలలు ఒక్కసారిగా విరుచుకుపడటంతో అక్కడి ఇళ్లలో చాలావరకు దెబ్బతిన్నాయి. సముద్ర అలలు ఆదివారం అర్థరాత్రి తీవ్ర రూపం దాల్చడంతో అక్కడి ప్రజలు తమ ఇళ్లు ఖాళీ చేసి వెళ్లి పోవాల్సి వచ్చింది. 

సముద్రపు గోడ

కోజికోడ్ జిల్లాలో సముద్ర తీర ప్రాంతంలో సముద్ర అలలు నుంచి రక్షణగా సముద్రపు గోడను ఏర్పాటు చేసింది అక్కడి ప్రభుత్వం. ఆదివారం రాత్రి కళ్లకడల్ కారణంగా శాంతి నగర్ కాలనీ సమీపంలో దాదాపు 30 మీటర్ల మేర సముద్రపు గోడ ధ్వంసమైంది. 2001లో వివిధ ప్రాంతాల నుండి మట్టినిట్టి సేకరించడం ఈ గోడను నిర్మించారు.  సముద్రపు నీరు సముద్రపు గోడను దాటి మరోసారి సముద్రం ఇళ్లలోకి చొచ్చుకొని వచ్చింది. 

ఆదివారం త్రిసూర్ తీర ప్రాంతంలోనూ సముద్ర తుఫాన్ అల్లకల్లోలం సృష్టించింది. పెరింజనం సమితి బీచ్, ఆరట్టు కడవు, మతిలకం పొక్లై బీచ్ తీరాల్లో కూడా భారీ అలలు ఎగిసిపడటంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యాయి. 

మరోవైపు వంచిపురా  వద్ద లోతైన సముద్రంలో ఆదివారం ఉదయం భారీ ఎత్తున సముద్ర అలలు ఎగిసిపడ్డాయి. దీంతో అప్రమత్తమైన మత్స్యకారులు ఒడ్డుకు చేరుకున్నారు. వందలాది చిన్న, పెద్ద ఓడలు లంగరు వేయబడ్డాయి. 

అయితే కళ్లకడల్ ఇక్కడ సాధారణమే.. మత్స్ కారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి ప్రజలకు ఇండ్లు కట్టించింది. అయితే తాత్కాలికంగా వారు సముద్ర గోడను ఆనుకొని ఇక్కడి నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని  స్థానిక ప్రజాప్రతినిధులు అంటున్నారు.. వారికి సహాయం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. 

కేరళలో తీరంలో ఇలాంటి సముద్రపు ఆటుపోటులు సహజమే అయినప్పటికీ ఇలా అకస్మాత్తుగా సముద్రపు ఉప్పొంగడం ఇటీవల కాలంలో ఎక్కువయిందని అక్కడి ప్రజలు అంటున్నారు. బహుశా ఇది గ్లోబల్ వార్మింగ్ ప్రభావవేమో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.