త్వరలో ఒక్క సిగరెట్ ధర 72 రూపాయలు ? స్మోకింగ్ మానేద్దాంరా బాబు అనుకునే రోజు వస్తుందా !

త్వరలో ఒక్క సిగరెట్ ధర 72 రూపాయలు ? స్మోకింగ్ మానేద్దాంరా బాబు అనుకునే రోజు వస్తుందా !

సిగరెట్ తాగే వాళ్లకు ఇదైతే బ్యాడ్ న్యూసే. ఇప్పటికే రేట్లు ఎక్కువయ్యాయి.. శాలరీలో చాలా వరకు సిగరెట్లకే పోతుందనుకునే వాళ్లకు పిడుగు లాంటి వార్తనే చెప్పాలి. త్వరలో ఒక్క సిగరెట్ ధర 72 రూపాయలు అవుతుందట. కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

సిగరెట్ అమ్మకాలను, వినియోగాన్ని తగ్గించేందుకు సిగరెట్లపై ఎక్సైజ్ డ్యూటీని భారీగా పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా అధికార వర్గాల నుంచి వచ్చిన సమాచారం. ప్రస్తుతం 18 రూపాయలుగా ఉన్న ఒక సిగరెట్ ధర.. త్వరలో 72 రూపాయలు పెరుగుతుందని ప్రభుత్వ అధికారులు తెలిపారు. అంటే మూడు రెట్లు పెరుగుతుందన్న మాట. కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరీ ప్రవేశ పెట్టిన బిల్లులో పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీ, సెస్ రివైజ్ చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు.

సోషల్ మీడియాలో మిక్స్డ్ రియాక్షన్స్:

ఈ నిర్ణయాన్ని కొందరు సమర్ధిస్తుండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నా. సోషల్ మీడియాలో మిక్స్ డ్ రియాక్షన్స్ వస్తున్నాయి. లేటెస్ట్ అప్డేట్ ను స్క్రీన్ షాట్ తీసి ఒక రెడిట్ యూజర్ పోస్ట్ చేశాడు. నేను స్కోకర్ అయినప్పటికీ.. ఈ నిర్ణయాన్ని సమర్ధిస్తాను. దీని కారణంగా ఇండియాలో స్మోకర్స్ తగ్గిపోతారు. ముఖ్యంగా స్టూడెంట్స్, యూత్ స్మోకింగ్ తగ్గించే అవకాశం ఉంది. నేను కూడా మానేస్తాను.. అంటూ పోస్ట్ చేశాడు. 

►ALSO READ | INS వాగ్‌షీర్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సముద్ర విహారం

సిగెరెట్ ధరల పెరుగుదలపై కొందరు జోక్స్ వేసుకుంటున్నారు. రేట్లు పెరిగితే ఏం ఫరక్ పడదు. సిగరెట్ తాగకపోయినా నష్టం లేదు. ఎందుకంటే.. ఢిల్లీలో ఆల్ రెడీ ఫ్రీగా పొగను పీల్చుకుంటున్నాం. ఇక సిగరెట్ ఎందుకు అంటూ కామెడీ చేస్తున్నారు. కొందరు ధరల పెరుగుల కారణంగా స్మోకింగ్ ట్రెండ్ మారుతుందని కామెంట్స్ చేస్తున్నారు. 

కొందరి వాదన వేరేలా ఉంది. ధరలు పెంచడం వలన స్మోకర్స్ ఇ-సిగరెట్స్  లాంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకునే అవకాశం ఉందని అంటున్నారు. దీనికి తోడు ఇల్లీగల్  సేల్స్ పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. దీని కారణంగా హెల్త్ ఇష్యూప్ పెరగొచ్చు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

స్మోకింగ్ ఆల్కహాల్ ను కంప్లీట్ గా బ్యాన్ చేయాలని ఒకరంటే.. సిగరెట్ స్టాక్స్ కొనేందుకు ఇది మంచి టైమ్ అంటూ మరొకరు జోక్స్ వేస్తున్నారు.