బెంగళూర్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జలాంతర్గామిలో ప్రయాణించారు. ఆదివారం (డిసెంబర్ 28) కర్ణాటకలోని కార్వార్ నావల్ బేస్ నుంచి కల్వరి- శ్రేణి సబ్ మెరైన్ ఐఎన్ఎస్ వాగ్‌షీర్‌లో ఆమె సముద్ర విహారం చేశారు. ముర్ము వెంట నేవీ చీఫ్ దినేష్ కె త్రిపాఠి, భారత నావికాదళానికి చెందిన ఇతర అధికారులు ఉన్నారు. తద్వారా కల్వరి- శ్రేణి జలాంతర్గామిలో ప్రయాణించిన తొలి రాష్ట్రపతిగా ఆమె నిలిచారు.
అంతేకాకుండా జలాంతర్గామిలో సముద్ర విహారం చేసిన రెండో రాష్ట్రపతిగా రికార్డ్ నెలకొల్పారు. ముర్ము కంటే ముందుగా దివంగత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజీ అబ్ధుల్ కలాం సబ్ మెరైన్‌లో ప్రయాణం చేశారు. 2025, అక్టోబర్ 29న ద్రౌపది ముర్ము ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్ రాఫెల్లో ప్రయాణించిన విషయం తెలిసిందే. అంతకంటే ముందు ఆమె సుఖోయ్ యుద్ధ విమానంలో కూడా గగనవిహారం చేశారు.
INS వాగ్‌షీర్ ప్రత్యేకతలు:
ఐఎన్ఎస్ వాగ్‌షీర్ భారత నావికాదళానికి చెందిన కల్వరి-క్లాస్ డీజిల్-ఎలక్ట్రిక్ అటాక్ సబ్ మెరైన్. దీనిని ఫ్రాన్స్ నావల్ గ్రూప్ లైసెన్స్‌తో ముంబైకి చెందిన మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (MDL) నిర్మించింది. దీనిని ఉపరితల వ్యతిరేక, జలాంతర్గామి వ్యతిరేక కార్యకలాపాలను నిర్వహించడానికి నేవీ ఉపయోగిస్తోంది. అలాగే నిఘా, నిఘా మిషన్లకు కూడా ఉపయోగించవచ్చు.
►ALSO READ | ఇండియా కొడితే మాములుగా ఉండదు మరీ: ఆపరేషన్ సిందూర్‌తో నష్టపోయింది నిజమేనని ఒప్పుకున్న పాక్
